సాయిప్రసాద్‌రెడ్డి హయాంలో అభివృద్ధి...మీనాక్షినాయుడు హయాంలో అధోగతి
ఆదోని, న్యూస్‌లైన్ : ఒక సువర్ణయుగం తర్వాత ఐదేళ్లపాటు అభివృద్ధి కుంటుపడింది. కొత్త పథకాలు లేవు.. ఉన్న పథకాలు సక్రమంగా అమలుకావు.. గ్రామాలు, పట్టణాల్లో సీసీ రోడ్లు, కాలువలు లేక వీధులన్నీ మురుగుకుంటలుగా మారా యి.. అర్హులైన వారు వందలసార్లు వినతులు ఇచ్చినా పింఛన్లు మంజూరు కాలేదు.. సమస్యలను పరిష్కరించి ప్రజా సంక్షేమానికి కృషి చేయాల్సిన ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వంపై సాకులు చెబుతూ చేతులు దులుపుకున్నాడు.. ఎమ్మెల్యేనే ప ట్టించుకోకపోవడంతో ప్రభుత్వమూ నియోజకవర్గ అభివృద్ధిని మరించింది.. ఇలాంటి దుస్థితి నెలకొన్నది ఆంధ్రా ముంబాయిగా పేరు గాంచిన ఆదోని నియోజకవర్గంలో.. అందుకే ప్రజలు ఈ సారిఎన్నికల్లో తమ సమస్యలను పరిష్కరించే నాయకుడి వెంట నడిచేందుకు సిద్ధమవుతున్నారు.
2004 నుంచి 2009 వరకు ఆదోని ఎమ్మెల్యేగా ఉన్న సాయిప్రసాద్‌రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించారు. నాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిని ఒప్పించి భారీ మొత్తంలో నిధులు విడుదల చేయించారు. దాదాపు రూ.120 కోట్లకుపైగా నిధులతో అభివృద్ధి పనులు చేపట్టారు.
ఆ సమయంలో జరిగిన అభివృద్ధి పనుల్లో ముఖ్యమైనవి
- ఆదోని పట్టణంలో బైపాస్ రోడ్డుకు రూ.11 కోట్లు మంజూరు. దాదాపు 80 శాతం పనులు పూర్తి అయ్యాయి.
- బళదూరు - ఆదోని మధ్య కాజ్‌వేను దాదాపు రూ.2.11 కోటత్లో పూర్తి చేశారు. ఇప్పడు వరద వచ్చినా రాకపోకలకు ఎలాంటి ఇబ్బందీ లేదు.
- పెద్దహరివాణంలో రూ.26 లక్షలతో చేపట్టిన అదనపు ఎస్‌ఎస్ ట్యాంకు నిర్మా ణం వల్ల వేసవిలో నీటి ఎద్దడి తీరింది.
- కుప్పగల్లు ప్రధాన కేంద్రంగా రూ.4.5 కోట్లతో తాగు నీటి పథకం నిర్మాణం చేపట్టారు. దీంతో కుప్పగల్లు, పాండవగల్లు, గణేకల్లు, బల్లేకల్లు, జాలిమంచి గ్రామాలకు రక్షిత మం చినీరు అందుబాటులోకి వచ్చాయి.
- నాగ నాథనహళ్లి ప్రధాన కేంద్రంగా 12 గ్రామాల ప్రజల దాహార్తిని తీర్చేం దుకు అవసరమైన తాగు నీటి పథకం నిర్మాణానికి రూ.14 కోట్లు మంజూరు అయ్యాయి. దీనివల్ల ఆదోని నియోజకవర్గంలోని నాగనాథనహళ్లి, ఢణాపురం, చాగి గ్రామాల ప్రజల దాహార్తి తీరింది.
-జి.హొసళ్లి-బదినేహాలు గ్రామాల మధ్య రూ.1.3 కోట్లతో రోడ్డు నిర్మాణం చేపట్టడంతో కౌతాళం మండలంలోని కుంటనహాళు, ఉప్పరహాళు, బాపురంతో పాటు హచ్చొళ్లి మీదుగా కర్ణాటక వెళ్లే ప్రయాణికులకు దాదాపు 20 కి.మీ. ప్రయాణభారం భారం తగ్గింది.
- దాదాపు రెండు దశాబ్దాలుగా క్రీడాకారులు, క్రీడల ప్రేమికుల కోరికను తీర్చేందుకు పట్టణంలో రూ.32 లక్షలతో మినీ స్టేడియం నిర్మించారు.
- పట్టణంలోని దాదాపు రూ.50 లక్షలతో పార్క్ నిర్మాణం చేపట్టారు.
- 2004 వరకు ఒక్కరికి పింఛన్ మంజూరు కావాలంటే అప్పటి వరకు లబ్ధిదారుల్లో ఎవరో ఒకరు చనిపోవా ల్సి వచ్చేది. కానీ వైఎస్‌ఆర్ వచ్చిన త ర్వాత నియోజకవర్గంలో 16 వేల మం ది వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పింఛన్లు మంజూరు చేశారు.
సాయిప్రసాద్‌రెడ్డి తర్వాత 2009లో ఎమ్మెల్యేగా ఎన్నికైన టీడీపీకి చెందిన మీనాక్షినాయుడు ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేశారు. తాను ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేనని, ప్రభుత్వం సహకరించడం లేదనే సాకు చూపుతూ అభివృద్ధిని విస్మరించారు. దీంతో ప్రజా సంక్షేమం స్తంభించిపోయింది. మండగిరి గ్రామ ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు రూ.6 కోట్లు మాత్రం మంజూరు అయ్యాయి. ఆ నిధులకు సంబంధించి టెండరు ప్రక్రియ మాత్రమే పూర్తయ్యింది.
రూరల్ మండలంలోని చిన్నగోనేహాళు వంకపై బ్రిడ్జ్ నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయని ఎమ్మెల్యే ప్రకటించారు. కానీ ఇంత వరకు పనులు మాత్రం ప్రారంభానికి నోచుకోవడం లేదు. ఉద్యోగుల జీత భత్యాలు ప్రభుత్వమే భరిస్తున్నందున ప్రజలు చెల్లిస్తున్న వివిధ రకాల పన్నులు మునిసిపల్ ఖజానాలో జమఅయ్యాయి. ఆ నిధులతోనే కొన్ని అభివృద్ధి పనులు చేపట్టారు. మీనాక్షినాయుడు పాలనాకాలంలో అనర్హులనే సాకుతో వందలాది మంది పింఛన్లు రద్దు అయ్యాయి.
వృద్ధులు, వికలాంగులు, వితంతువులు వాటిని పునరుద్ధరించాలని వేడుకుంటున్నా ఫలితం కనిపించలేదు. మంచి ప్రభుత్వం, స్థానికంగా సమర్థుడైన నాయకుడు లేకపోవడం వల్లే తమ పరిస్థితి ఇలా అయ్యిందంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సారి సార్వత్రిక ఎన్నికల్లో మంచి వ్యక్తిని ఎన్నుకోడానికి సిద్ధమవుతున్నారు.