
పాలమూరును పట్టించుకోని కేసీఆర్: జైపాల్‌రెడ్డి
మక్తల్, తెలంగాణ పునర్నిర్మాణం కాంగ్రెస్‌తోనే సాధ్యమని కేంద్ర మంత్రి సూదిని జైపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మహబూబ్‌నగర్ జిల్లా మాగనూర్, మక్తల్ మండలాల్లో ఎన్నికల ప్రచార సభల్లో ఆయన మాట్లాడారు. ప్రాంతీయ పార్టీలతో తెలంగాణ అభివృద్ధి సాధ్యం కాదన్నారు. కొందరు వారి పబ్బం గడుపుకోవడానికే.. ఆచరణ సాధ్యంకాని హామీలను గుప్పిస్తున్నారని కేసీఆర్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. వెనుకబడిన మహబూబ్‌నగర్ జిల్లా నుంచి లోక్‌సభ సభ్యుడిగా గెలిచిన కేసీఆర్.. జిల్లాను ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.