రిజర్వేషన్లు రద్దు చేసే మోడీకి పవన్ మద్దతా ? | Pawan Modi support reservation to cancel ? | Sakshi
Sakshi News home page

రిజర్వేషన్లు రద్దు చేసే మోడీకి పవన్ మద్దతా ?

Published Sat, May 3 2014 12:56 AM | Last Updated on Fri, Mar 22 2019 5:29 PM

రిజర్వేషన్లు రద్దు చేసే మోడీకి పవన్ మద్దతా ? - Sakshi

రిజర్వేషన్లు రద్దు చేసే మోడీకి పవన్ మద్దతా ?

 తెనాలిఅర్బన్, న్యూస్‌లైన్: బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తే కులమతాల ప్రాతిపదికన అమలులో ఉన్న రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రకటిస్తుంటే, ఆ పార్టీ తరఫున ప్రధాని రేసులో ఉన్న నరేంద్రమోడీకి జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ మద్దతు పలకటమేమిటని ఇమానే మజ్లిస్ యువజన కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఫరీద్ ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ వైఖరిని నిరసిస్తూ శివాజీచౌక్‌లో ఆయన ఫ్యాన్స్ మైనారిటీ విభాగం యువకులతో కలిసి శుక్రవారం నిరసన ప్రదర్శన చేశారు. ‘మోడీ హఠావో-దేశ్‌కు బచావో’ ‘పవన్ హఠావో-మైనారిటీస్ బచావో’ అంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు.

అనంతరం ఫరీద్ మాట్లాడుతూ 15 ఏళ్లుగా పవన్ కల్యాణ్‌పై పెంచుకున్న అభిమానాన్ని, ఆయన మోడీకి మద్దతు తెలపడంతో 15 నిముషాల్లో హరించిపోయిందన్నారు. పవన్ వ్యాఖ్యలు ముస్లిం మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని తెలిపారు. మోడీకి పవన్ ఎందుకు మద్దతు పలుకుతున్నారో కూడా స్పష్టత లేదని పేర్కొన్నారు. గోద్రా అల్లర్లపై పెదవి విప్పని పవన్, ఇప్పుడు మోడీ నాయకత్వాన్ని ఎందుకు సమర్థిస్తున్నారని ప్రశ్నించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఇమానే మజ్లిస్ యువజన కమిటీ గౌరవాధ్యక్షుడు షేక్ నశీం, రఫీ, మునీర్, ఖలీల్, సుభాని, నాగూర్, సైదా, భేగ్, ఖాదిర్, కరిముల్లా, అస్లం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement