'కేశినేని ఓటమే లక్ష్యంగా పనిచేస్తాం' | Potluri Vara Prasad group against to Kesineni Nani | Sakshi
Sakshi News home page

'కేశినేని ఓటమే లక్ష్యంగా పనిచేస్తాం'

Published Tue, Apr 15 2014 8:40 PM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM

కేశినేని నాని - Sakshi

కేశినేని నాని

విజయవాడ: విజయవాడ లోక్సభ నియోజకవర్గ టిడిపి బాధ్యుడు, ఆ పార్టీ లోక్సభ అభ్యర్థి  కేశినేని నానిని ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తామని సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్‌(పివిపి) వర్గీయులు శపథం చేశారు. విజయవాడ లోక్సభ నియోజవర్గం పార్టీ టికెట్ కేశినేనికి ఇచ్చిన విషయం తెలిసిందే. 1983లో టీడీపీ సభ్యత్వ పుస్తకాలు అమ్ముకుని  సస్పెన్షన్‌కు గురైన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి నాని అని వారు విమర్శించారు. అతను ఒకే పర్మిట్‌పై 4 బస్సులు తిప్పి ఎన్నో కేసులు ఎదుర్కొంటున్నాడన్నారు.  

హెచ్‌-1 వీసాలు ఇప్పిస్తానని విద్యార్థుల నుంచి డబ్బు దోచుకున్న చరిత్ర కేశినేనిదని పీవీపీ వర్గీయులు ధ్వజమెత్తారు. పార్లమెంట్‌ గేటు తాకే అర్హత కూడా లేని వ్యక్తి కేశినేని నాని అని మండిపడ్డారు. కేశినేని ఓటమికి అన్ని అవకాశాలను వాడుకుంటామని వారు చెప్పారు. ఇండిపెండెంట్‌గా పీవీపీ పోటీపై త్వరలో ప్రకటన వెలువడుతుందన్నారు.

ఇదిలా ఉండగా, కేశినేని నానికి టిడిపి బిఫామ్ ఇచ్చినప్పటికీ జనసేన పార్టీ వ్యవస్థాపకుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సిఫారసు చేసిన వ్యక్తికే టిడిపి టికెట్ కేటాయించే అవకాశం ఉందని వినవస్తోంది. పవన్ కళ్యాణ్  పొట్లూరి వరప్రసాద్‌ పేరును సూచిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement