న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అమేథి నియోజవర్గంలో వెనుకబడ్డారు. ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థి, టీవీ నటి స్మృతి ఇరానీ ఆధిక్యంలో ఉన్నారు. దేశవ్యాప్తంగా ఎన్డీఏ తిరుగులేని ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం దిశగా సాగుతోంది. అమేథిలో లక్షల ఓట్ల మెజార్టీతో నెగ్గిన రాహుల్ గాంధీ ఈసారి వెనుకబడటం గమనార్హం.