మోడీ నాయకత్వంలోనే దేశప్రగతి: రాజాసింగ్‌ | raja singh lodha election campaign | Sakshi
Sakshi News home page

మోడీ నాయకత్వంలోనే దేశప్రగతి: రాజాసింగ్‌

Published Fri, Apr 11 2014 8:30 PM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM

మోడీ నాయకత్వంలోనే దేశప్రగతి: రాజాసింగ్‌ - Sakshi

మోడీ నాయకత్వంలోనే దేశప్రగతి: రాజాసింగ్‌

హైదరాబాద్:  నరేంద్ర మోడీ నాయకత్వంలోనే దేశం ప్రగతి సాధిస్తుందని గోషామహల్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ లోథా అన్నారు. శుక్రవారం బేగంబజార్, కోల్సావాడీ, ఫీల్‌ఖానా, మచ్ఛీమార్కెట్, ఉస్మాన్‌షాహి, గౌలిగూడ తదితర ప్రాంతాలలో ఆయన ఇంటింటికి పాదయాత్ర నిర్వహించి బీజేపీకి ఓటువేయాలని ప్రచారం సాగించారు.

కాంగ్రెస్ పాలనలో దేశం అన్ని రంగాల్లోనూ వెనుకబడి పోయిందన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రజలు నరేంద్రమోడీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, మోడీ నేతృత్వంలో దేశం పురోగమిస్తుందని ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. గుజరాత్ రాష్ట్రంలా దేశాన్ని అభివృద్ధి చేయగల సత్తా మోడీకే ఉందన్నారు. అవినీతి రహిత పాలన కోసం బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement