సాక్షి, ముంబై: రాష్ట్రంలో మూడు విడతల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో రెండుసార్లు తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నవీముంబైలో ఆదివారం మాథాడి కార్మికుల సదస్సులో పాల్గొన్న పవార్ బోగస్ ఓటిం గ్‌ను ప్రేరేపించే విధంగా మాట్లాడారు. ‘సతారాలో ఏప్రిల్ 17న ఎన్నికలు ఉన్నాయి. అక్కడ గడియారం గుర్తుకు ఓటు వేసి 24వ తేదీన ముంబైకి రావాలి. మళ్లీ గడియారం గుర్తుకు ఓటు వేయాలని సూచించారు. మీరు చేయాల్సిందేమిటంటే మొదటి విడతలో వేలికి అంటించిన ఇంకును తొలగించుకోవాలి.
ముంబైలో మళ్లీ గడియారం గుర్తుకు ఓటు వేయాల’ని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలు వివిధ పార్టీల నాయకులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఎలాంటి సమస్యలకైనా, ప్రశ్నలకైనా ఆచితూచి సమాధానమిచ్చే పవర్ ఇలా మాట్లాడడమేంటని వారు చర్చిం చుకుంటున్నారు. కాగా, 2009లో లోక్‌సభ ఎన్నికలు సతారా, ముంబైలో ఒకేసారి జరిగాయి. ఈసారి సతారాలో ఏప్రి ల్ 17న, ముంబైలో 24న జరుగుతున్నాయి. గతంలో ఎన్సీపీ ఇదే ఫార్మూ లా అవలంభించి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2009లో సతారా, ముంబైలో ఒకరోజు ఎన్నికలు జరిగి నప్పటికీ పశ్చిమ మహారాష్ట్రలో ఏప్రిల్ 23న, ముం బైలో ఏప్రిల్ 30న ఎన్నికలు జరిగాయి. దీంతో ఎన్సీపీ కార్యకర్తలు అప్పుడు కూడా ఇలాగే రెండుసార్లు తమ ఓటు హక్కును వినియోగించుకుని ఉండొచ్చని ప్రత్యర్థులు భావిస్తున్నారు.
ఈసీ చర్యలు తీసుకోవాలి: ఆర్పీఐ
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రెండుసార్లు ఓటేయ్యాలని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ చేసిన ప్రకటనను ఎన్నికల కమిషన్ పరిశీ లించి తగిన చర్యలు తీసుకోవాలని ఆర్పీఐ అధ్యక్షుడు అథవలే డిమాండ్ చేశారు. ‘బోగస్ ఓటింగ్‌ను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం. ఎన్సీపీ వ్యాఖ్యలకు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. పవార్ ప్రకటనను ఈసీ తనిఖీ చేసి చర్యలు తీసుకోవాల’ని అథవలే ఆదివారం మీడియాతో అన్నారు. ఇలాంటి చట్టవ్యతిరేక ప్రకటనలు చేయడం మంచిది కాదన్నారు.
పవార్‌పై చర్యలు తీసుకోవాలి: ఆప్
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రెండుసార్లు ఓటు హక్కు వినియోగించుకోవాలని పార్టీ కార్యకర్తలకు సూచించిన ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) మండిపడింది. బోగస్ ఓట్లను ప్రేరేపించేలా మాట్లాడిన పవార్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌కు లేఖ రాస్తామని ఆప్ రాష్ట్ర విభాగ కార్యదర్శి ప్రీతి మోనాన్ పేరిట ఆదివారం ఓ ప్రకటన విడుదలైంది. ఈసారి రాష్ట్రంలో ఎన్నికల్లో బోగస్ ఓట్లను నియంత్రిం చేందుకు అన్ని పొలింగ్ కేంద్రాల్లో ఆప్ కార్యకర్తల నిఘా ఉం టుందని, ఈసీకి సమాచారమందిస్తామని ఆప్ తెలిపింది.
రెండుసార్లు ఓటేయండి
Published Sun, Mar 23 2014 10:20 PM | Last Updated on Fri, Oct 19 2018 8:23 PM
Advertisement