సోనియాజీ.. అబద్దాలాడొద్దు: కిషన్‌రెడ్డి
* తెలంగాణ కోసం చిత్తశుద్ధిగా వ్యవహరించింది బీజేపీయే: కిషన్‌రెడ్డి
* వారి సర్టిఫికెట్లు మాకవసరం లేదు
* సోనియా రాకను ప్రజలే పట్టించుకోలేదు..
* ఆమె వచ్చినట్టు పత్రికల ద్వారానే తెలిసింది
* బీజేపీ వచ్చాక ఈబీసీలకు రిజర్వేషన్లు
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ బిల్లు సందర్భంలో బీజేపీ వ్యవహరించిన తీరు ప్రజలంతా స్పష్టంగా గమనించారు. చిత్తశుద్ధితో మేం తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేశాం. అలాంటిది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న సోనియా గాంధీగారూ మీరు అబద్ధాలు చెప్పడం సరికాదు. తెలంగాణ బిల్లును అడ్డుకునేందుకు ప్రయుత్నించావున్న ఆమె మాటలు హాస్యాస్పదం. అయినా మాకు సోనియా, రాహుల్‌ల సర్టిఫికెట్లు అవసరం లేదు. ప్రజలే సర్టిఫికెట్లు ఇస్తారు’ అని బీజేపీ తెలంగాణ అధ్యక్షులు కిషన్‌రెడ్డి అన్నారు. సినీనటుడు రాజశేఖర్ బీజేపీకి వుద్దతు ప్రకటించిన సందర్భంగా పార్టీ కార్యాలయుంలో కిషన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ కోసం బీజేపీ తీవ్రంగా కృషి చేస్తే... అడ్డుకునేందుకు యత్నించిన కాంగ్రెస్ మా పార్టీ భుజాలపై తుపాకీ పెట్టి ఆ పాపాన్ని మాకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. సోనియూ రాష్ట్రానికి వచ్చి కరీంనగర్‌లో జరిగిన సభలో పాల్గొని వెళ్లారనే విషయుం తెల్లారి పత్రికల్లో వస్తేకానీ తెలియులేదని, ప్రజలు ఈ విషయూన్నే పట్టించుకోలేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సోనియూ మొదటి సారి వచ్చినప్పుడు పరిస్థితి ఇలా ఉందంటే కాంగ్రెస్ దుస్థితి ఏ విధంగా ఉందో తెలుస్తోందన్నారు.
తెలంగాణకు కాంగ్రెస్ ఎంత ద్రోహం చేసిందో ప్రజలెన్నటికీ మరిచిపోరని, అందుకే తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని తెలుసుకుని నరేంద్రమోడీని ప్రధానిని చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే.. కులమతాలకతీతంగా ఆర్థికంగా వెనకబడ్డ వారందరికీ రిజర్వేషన్లు అమలు చేస్తుందని కిషన్‌రెడ్డి చెప్పారు. వాజ్‌పేరుు ప్రధానిగా ఉన్నప్పుడే దీని అవులుకు కమిషన్ వేశారని, కానీ ఈలోపు ఎన్నికలు రావడంతో అది కుదరలేదన్నారు. మతపరమైన రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమని పేర్కొన్నారు.
ఓ సినిమా స్టార్ వల్లే కాంగ్రెస్‌ను వీడా: హీరో రాజశేఖర్
ఎన్టీఆర్ వల్ల రాజకీయాల్లోకి వచ్చిన తాను, పదవి నుంచి తొలగించిన సమయంలో చంద్రబాబును కూడా నిలదీశానని సినీ హీరో రాజశేఖర్ అన్నారు. ఆ తర్వాత మళ్లీ బాబుకే మద్దతివ్వాల్సి వచ్చిందని, వై.ఎస్.రాజశేఖరరెడ్డి చొరవవల్ల కాంగ్రెస్‌లో చేరానన్నారు. తెలుగులో ఓ సూపర్ హీరో వల్ల తన కుటుంబానికి అన్యాయం జరిగినప్పుడు వై.ఎస్. అండగా నిలిచారన్నారు. ఆ తర్వాత అదే హీరో కాంగ్రెస్‌లోకి రావడం... ఆయన కాళ్లో చేతులో పట్టుకుని పొరపాటు జరిగిందని చెప్తేగానీ పార్టీలో ఉండే పరిస్థితి లేకపోవడంతో కాంగ్రెస్‌ను వీడినట్టు రాజశేఖర్ చెప్పారు. బయటి నుంచే బీజేపీకి మద్దతు తెలుపుతున్నట్టు చెప్పారు.