
రాహుల్‌పై చర్యలు తీసుకోండి
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి అయితే 22 వేల మంది హత్యకు గురవుతారంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా రెచ్చగొట్టే ప్రకటన చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసింది. హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్‌లో రాహుల్ చేసిన ప్రకటన అత్యంత తీవ్రంగా రెచ్చగొట్టేలా ఉందని, దీనిని తాము ఈసీ దృష్టికి తీసుకెళ్లినట్లు బీజేపీ నేత అనంత్ కుమార్ తెలిపారు. శనివారం ప్రధాన ఎన్నికల కమిషనర్ సంపత్‌ను అనంత్‌కుమార్ నేతృత్వంలోని బీజే పీ బృందం కలిసింది.