‘పచ్చ’ రౌడీలు
- ఓటమి భయంతో సహనం కోల్పోతున్న టీడీపీ అభ్యర్థులు
- ఓటర్లను బెదిరిస్తున్న నేతలు
- అంతు చూస్తామంటూ హెచ్చరికలు
- బెంబేలెత్తుతున్న ప్రజలు
సాక్షి, ఏలూరు : ఓటమి భయంతో అల్లాడిపోతున్న టీడీపీ అభ్యర్థులు, నాయకులు సహనం కోల్పోతున్నారు. నీచ రాజకీయూలకు ఒడిగట్టడంతోపాటు ఓటర్లపై విరుచుకుపడుతున్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వారి వైఖరి చూస్తుంటే ఎన్నికలు ముగియకముందే తమ ఓటమిని వారే ఒప్పుకుంటున్నట్లు ఉందని జనం ఛీ కొడుతున్నారు.
అంతు చూస్తామంటూ బెదిరింపులు
జిల్లాలో టీడీపీ రౌడీ రాజకీయాలకు మరోసారి తెరతీస్తోంది. ఆ పార్టీకి చెందిన అభ్యర్థి ఒకరు ఆది వారం రాత్రి ఓ గ్రామానికి వెళ్లారు. అక్కడ ఓట్లు అభ్యర్థించడం మానేసి ‘ఇద్దరు అభ్యర్థులు ఎక్కడి నుంచో వచ్చారు. వాళ్ల దగ్గర డబ్బులున్నాయి. తీసుకోండి ఓటు మాత్రం నాకే వేయండి’ అనడంతో.. మీరెక్కడి నుంచి వచ్చారంటూ జనం ఎదురు ప్రశ్నించారు. దాంతో కోపోద్రిక్తుడైన ఆ నేత వారిపై కన్నెర్ర జేశారు. రాయడానికి వీల్లేని బండ బూతులు తిట్టారు. అక్కడితో ఆగకుండా తనకు ఓటెయ్యకపోతే అంతుచూస్తానని బెది రించారు. ఇది ఓ గ్రామానికి, ఒక అభ్యర్థికి పరిమితం కాలేదు. ఓడిపోతామనే భయంతో ప్రతి నియోజకవర్గంలోనూ టీడీపీ అభ్యర్థులు, నాయకులు ఇదే పంథాను అనుసరి స్తున్నారు. ఓ అభ్యర్థి బూతు జోకులతో జనం అసహ్యించుకునేలా మాట్లాడుతున్నారు. అసెంబ్లీ సెగ్మెంట్లలోని టీడీపీ అభ్యర్థులు ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వారిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
వైఎస్సార్ సీపీకి లభిస్తున్న ఆదరణను తట్టుకోలేక...
సాధారణంగా ఓటు అడగడానికి వెళ్లే అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి చూస్తారు. వారికి అత్యంత గౌరవమిచ్చి మాట్లాడతారు. అందుకు భిన్నంగా టీడీపీ అభ్యర్థులు వ్యవహరిస్తున్న తీరుతో జనం బెంబేలెత్తిపోతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు లభిస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేకపోతున్న టీడీపీ అభ్యర్థులు వారిని నిలువరించలేక ఓట ర్లను టార్గెట్ చేస్తున్నారు. ఆదినుంచీ ఆ పార్టీ ఇదే పద్ధతిని అవలంభిస్తోంది. గడిచిన ఎన్నికల్లో పార్టీ బల హీనంగా ఉన్నచోట ప్రత్యర్థులతో కావాలనే తగవులు పెట్టుకున్నారు.
రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించడం ద్వారా పోలింగ్‌ను ప్రభావితం చేయాలని చూశారు. కొందరు అధికారులు సైతం టీడీపీ ఆగడాలకు కొమ్ముకాశారు. డబ్బు తరలింపునకు సైతం సాయపడి చివరకు ఉద్యోగం మీద కు తెచ్చుకున్నారు. డబ్బునే నమ్ముకున్న పచ్చ చొక్కాలు ఎన్నికల నిబంధనలను లెక్కచేయడం లేదు. చట్టా న్ని గౌరవించడం లేదు. ఓటర్లను గౌరవించడం లేదు. కేవలం పదవి పిచ్చిపట్టిన వారిలా చిందులు తొక్కుతున్నారు. బెదిరిస్తే ఓట్లు పడిపోతాయనే భ్రమల్లో ఉన్నారు. వారి రౌడీయిజానికి లొంగిపోయి ఓట్లు వేసేది లేదని.. తమ కష్టాలు తీర్చే నేతకు ధైర్యంగా ఓటేసి గెలిపించుకుంటామని ప్రజలు స్పష్టం చేస్తున్నారు.