తప్పును ప్రశ్నించాడని.. వైఎస్సార్సీపీ కార్యకర్తపై టీడీపీ వర్గీయుల దాడి
ఆలూరు రూరల్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా తప్పును ఎత్తి చూపాడనే కక్షతో వైఎస్సార్సీపీ కార్యకర్తపై టీడీపీ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన ఆయన పోలీసులను ఆశ్రయించాడు. బాధితులు తెలిపిన వివరాల మేరకు... మండలంలోని చాకిబండలో బుధవారం మధ్యాహ్నం ఓటు వేసేందు కు దేవమ్మ అనే వృద్ధురాలు పోలింగ్ కేంద్రానికి వచ్చింది. ఆమె పేరు జా బితాలో తప్పుగా ఉండడంతో ఎన్నికల సిబ్బంది ఓటు వేయనీయకుం డా వెనక్కు పంపారు. గంట తర్వాత టీడీపీ వర్గీయులు అదే దేవమ్మను తీసుకుని వచ్చి ఓటు వేయించారు.
ఈ విషయంపై పోలింగ్ కేంద్రం వద్ద ఉన్న వైఎస్సార్సీపీ కార్యకర్త సూర్యనారాయణ ఎన్నికల సిబ్బందిని ప్రశ్నించారు. మొదట ఓటర్ జాబితా లో పేరు తప్పు ఉందని వెనక్కు పం పి, ఇప్పుడు ఎలా ఓటు వేయించారని నిలదీశాడు. దీనిని జీర్ణియించుకోలేని టీడీపీ వర్గీయులు సుధాకర్, రామిరెడ్డి, ఆనంద్‌గౌడ్, నాగప్ప తది తరులు బుధవారం అర్ధరాత్రి సూర్యనారాయణ ఇంటి వద్దకు వెళ్లి ఆయనపై దాడి చేశారు. ఈ దాడిలో సూర్యనారాయణ తలకు తీవ్రగాయాలయ్యాయి. గ్రామ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు జరిగిన విషయాన్ని హాలహర్వి ఎస్‌ఐ రమేష్‌బాబుకు తెలిపారు. వెంటనే పోలీ సులు గ్రామానికి చేరుకుని దాడికి సంబంధించిన వివరాలను సేకరిం చారు. గురువారం ఆరుగురు నింది తులపై కేసు నమోదు చేశారు.