అనంతపురం జిల్లా హిందూపురంలో టీడీపీ నేతకు చెందిన ఫంక్షన్‌హాల్‌లో టీడీపీ నేతలు, కార్యకర్తలు సమావేశమయ్యారు. కార్యకర్తలతో విజయవాడకు చెందిన టీడీపీ నాయకుడు యలమంచిలి బాబూ రాజేంద్రప్రసాద్ మంతనాలు సాగించారు. ఇదేంటని ప్రశ్నించిన వారికి, పోలింగ్ ఏజెంట్లతో చర్చిస్తున్నానని సమాధానం ఎదురైంది.
దానికి గంట క్రితమే ఫంక్షన్ హాల్‌లో ఓటరు స్లిప్పులతో టీడీపీ కార్యకర్తలు డబ్బులు పంచుతూ దొరికేశారు. కాగా, ఎన్నికలు మరికొన్ని గంటల్లో ఉన్నాయనగా స్థానికేతరుడైన వైవీబీ రాజేంద్ర ప్రసాద్ హిందూపురంలో ఉండటంపై వైఎస్ఆర్సీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు.
హిందూపురంలో కృష్ణాజిల్లా టీడీపీ నేత!
Published Tue, May 6 2014 2:40 PM | Last Updated on Tue, Aug 14 2018 4:24 PM
Advertisement
Advertisement