YVB Rajendra Prasad
-
ఈయన వైఎస్సార్సీపీ నాయకుడట!
సాక్షి, అమరావతి: తమ పార్టీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌తో కలిసి పనిచేసే వారంతా టీడీపీ వాళ్లు కాదని.. బిర్రు ప్రతాప్‌రెడ్డి వైఎస్సార్సీపీ నాయకుడేనని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పుకొచ్చారు. మంగళవారం ఆయన మంగళగిరి టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రతాప్‌రెడ్డితో కేసు వేయించి కావాలనే ఎన్నికలు ఆలస్యం చేశారని ఆరోపించారు. హైకోర్టు ఒక నెల సమయమిచ్చినా బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లడంలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. (సోమిరెడ్డి కూడా వైఎస్సార్‌సీపీయేనా..?) 50 శాతం రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం సరికాదన్నారు. దీనిపై పోరాడతామని, సుప్రీంకోర్టుకు వెళ్లే విషయాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. 50 శాతం రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే 16 వేల మంది బీసీలకు పదవులు పోతాయన్నారు. తమకు కేంద్రం నుంచి డబ్బులు రావాల్సి ఉన్నందునే.. 50 శాతం రిజర్వేషన్లతో ముందుకు వెళుతున్నామని అధికార పార్టీ చెప్పడం సరికాదన్నారు. దీనివల్ల జరిగే నష్టానికి ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. (చదవండి: చంద్రబాబు వల్లే సీట్ల కోత) చంద్రబాబు బీసీల వ్యతిరేకి టీడీపీ అధినేత చంద్రబాబు బీసీల వ్యతిరేకి అని మరోమారు రుజువైంది. బీసీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికి 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఎక్కడ ప్రాధాన్యత లభిస్తుందోననే భయంతో చంద్రబాబు కుట్రలకు తెరతీశారు. ఆయన నైజం తెలుసుకున్న బీసీలు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. – రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి -
టీడీపీని ఏకిపారేస్తున్న వంశీ..
సాక్షి, విజయవాడ: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన దగ్గర నుంచి ఆ పార్టీ నేతలు ఆయనపై మాటల దాడి చేస్తున్నారు. అయితే ఎమ్మెల్యే వంశీ మోహన్ కూడా ఏ మాత్రం తగ్గకుండా ఎదురుదాడికి దిగుతున్నారు. నువ్వు ఒకటంటే.. నేను రెండంటాను అన్నట్లు తెలుగుదేశం నేతల లోపాయికారి బాగోతం మొత్తాన్ని బహిర్గతం చేస్తున్నారు. పోలీసు స్టేషన్లకు చేరిన వివాదం.. గురువారం సాయంత్రం ఓ టీవీ చానల్లో జరిగిన డిబేట్లో ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌పై వంశీమోహన్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైవీబీ వర్గీయులు ఉయ్యూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా సోషల్ మీడియాలో టీడీపీ నేతలు తన ఫొటోలు మార్ఫింగ్ చేసి తమ క్యారెక్టర్‌ను, కుటుంబ పరువును దెబ్బ తీసే విధంగా పోస్టింగ్‌లు పెడుతున్నారంటూ వంశీ మోహన్ విజయవాడ పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావును కలిసి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారం టీడీపీతో సహా రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. టీడీపీని ఏకిపారేస్తున్న వంశీ.. శుక్రవారం టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ విలేకరుల సమావేశం నిర్వహించి వంశీ వ్యవహార శైలిని దుయ్యపట్టారు. అలాగే టీడీపీ నాయకులు వర్ల రామయ్య, జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, మాజీ మేయర్ పంచుమర్తి అనూరాధలు కూడా విలేకరుల సమావేశం నిర్వహించి వంశీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆయన కూడా ఎదురుదాడికి దిగారు. తనను కలిసిన విలేకరులతో తెలుగుదేశం పార్టీలో జరిగిన.. జరుగుతున్న బాగోతాలను పూసగుచ్చినట్లు వివరించారు. టీడీపీకి చెందిన ఒక నాయకుడు ఎన్నికల్లో గెలవలేరని, అయితే 25 లీటర్ల డీజిల్, బిర్యానీ ప్యాకెట్లు, ఐదు వేలు నగదు ఇస్తే ఎవరినైనా తిడతారంటూ ఘాటుగా విమర్శించారు. మరొక నాయకుడు కొనకళ్ల నారాయణ ఎన్నికల్లో పోటీ చేస్తే ఆయనకు వ్యతిరేకంగా పోటీ చేసి బాడిగ రామకృష్ణ వద్ద డబ్బులు తీసుకున్నారంటూ బాంబు పేల్చారు. మాజీ మంత్రి ఒకరు వేస్ట్ ఫెలో అని.. ఆయన వల్లే జిల్లాలో పార్టీ నాశనం అవుతోందంటూ కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు. ఇక చంద్రబాబు, నారా లోకేష్‌లపై ముప్పేట దాడి చేశారు. సోషల్ మీడియాలో తన క్యారెక్టర్‌ను నాశనం చేసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని, అందువల్లే అక్కడ జరిగిన వాస్తవాలన్ని బయట పెడుతున్నానని వంశీ ఆగ్రహంతో చెప్పారు. పరువు పాయే.. వంశీ మోహన్ తెలుగుదేశం పార్టీ వీడిపోతుంటే ఆయనను వ్యక్తిగత విమర్శలతో ఇరికిద్దమనుకున్న టీడీపీ నేతలకు ఊహించని షాక్ తగిలింది. తెలుగుదేశం పారీ్టలోని అంతర్గత విషయాలను వంశీ ఒక్కొక్కటిగా బయటపెడుతుండటంతో ఏమి పాలుపోని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటి వరకు తాను చెప్పింది 10 శాతమేనని అవసరమైతే ఇంకా అనేక విషయాలు బయటపెడతానని చెప్పడంతో పార్టీ నేతల్లో ఆందోళన మొదలైంది. జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో ఇప్పటికే పరువు పోయిందని, వంశీ చేస్తున్న వ్యాఖ్యలతో పార్టీ పరువు బజారన పడుతోందన్న చర్చ పార్టీలో జరుగుతోంది. -
ఉత్కంఠగా ఉయ్యూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక
ఉయ్యూరు: ఉయ్యూరు మున్సిపల్ చైర్మన్, వైఎస్ చైర్ పర్సన్ ఎన్నిక ఉత్కంఠగా సాగింది. టీడీపీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్, ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌లు సంయుక్తంగా రాజకీయం నడిపి తమ వారికి పదవులు వచ్చేట్లు చేశారు. ఎట్టకేలకు ఒప్పందం ప్రకారం చైర్మన్‌గా అబ్దుల్ ఖుద్దూస్, వైస్ చైర్ పర్సన్‌గా పండ్రాజు సుధారాణిలను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల్లో భాగంగా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. వైస్ చైర్ పర్సన్, చైర్మన్లతో జాయింట్ కలెక్టర్ ప్రమాణ స్వీకారం చేయించారు. -
హిందూపురంలో కృష్ణాజిల్లా టీడీపీ నేత!
అనంతపురం జిల్లా హిందూపురంలో టీడీపీ నేతకు చెందిన ఫంక్షన్హాల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు సమావేశమయ్యారు. కార్యకర్తలతో విజయవాడకు చెందిన టీడీపీ నాయకుడు యలమంచిలి బాబూ రాజేంద్రప్రసాద్ మంతనాలు సాగించారు. ఇదేంటని ప్రశ్నించిన వారికి, పోలింగ్ ఏజెంట్లతో చర్చిస్తున్నానని సమాధానం ఎదురైంది. దానికి గంట క్రితమే ఫంక్షన్ హాల్లో ఓటరు స్లిప్పులతో టీడీపీ కార్యకర్తలు డబ్బులు పంచుతూ దొరికేశారు. కాగా, ఎన్నికలు మరికొన్ని గంటల్లో ఉన్నాయనగా స్థానికేతరుడైన వైవీబీ రాజేంద్ర ప్రసాద్ హిందూపురంలో ఉండటంపై వైఎస్ఆర్సీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. -
వైవీబీ వర్సెస్ బోడే పెనంలూరు
టీడీపీలో గ్రూపుల కుంపటి =నాలుగేళ్లుగా ఇన్‌చార్జిలే లేని దుస్థితి =తీవ్ర నైరాశ్యంలో కార్యకర్తలు =నేడు అధినేత వద్ద పంచాయితీ =దిద్దుబాట పట్టేనా!? ఉయ్యూరు, న్యూస్‌లైన్ : పెనమలూరు నియోజకవర్గంలో టీడీపీ వర్గపోరుతో కుతకుతలాడుతోంది. పార్టీ అధికార ప్రతినిధి వైవీబీ రాజేంద్రప్రసాద్, దివంగత చలసాని పండు వర్గానికి చెందిన బోడే ప్రసాద్, వల్లభనేని వెంకటేశ్వరరావు(నాని)ల మధ్య ఆధిపత్యపోరు నడుస్తోంది. దీంతో నాలుగేళ్లుగా పార్టీ ఇన్చార్జినే నియమించలేని పరిస్థితి నెలకొంది. వైవీబీ, బోడేలు వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తూ నువ్వానేనా అన్నట్లు పోటీపడుతున్నారు. ఈ పంచాయితీ చివరకు పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వద్దకు చేరింది. ఆయన దిద్దుబాటు చర్యలపై దృష్టిపెట్టారు. గురువారం రాజధానిలో ఈ నియోజకవర్గం పరిస్థితి, ఇన్చార్జి నియామకం తదితర అంశాలపై ముఖ్యనేతలతో ఆయన సమీక్ష జరపనున్నట్లు సమాచారం అందింది. ఈ వర్గపోరుతో టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు తీవ్ర నైరాశ్యంలోకి నెట్టబడ్డారు. ఇటీవల ఈ రెండు గ్రూపుల మధ్య పార్టీ పరిశీలకుడు సుజనా చౌదరి పంచాయితీ చేశారు. పార్టీ మండల అధ్యక్షుడుగా పెనమలూరుకే పరిమితం కావాలని, ఇతర మండలాలకు వెళ్లి గందరగోళం సృష్టించవద్దని బోడేకు ఆయన సూచించారు. బోడే కొద్దిరోజుల పాటు మండలానికే పరిమితమయ్యారు. ఈ పరిణామాలపై పండు వర్గీయులు బాలకృష్ణకు ఫిర్యాదుచేశారు. బోడే చేస్తున్న సేవా కార్యక్రమాల వల్ల పార్టీకి ప్రయోజనమే కదా, ఆపడమెందుకు అని బాలకృష్ణ సమర్థించారు. బోడే తన కార్యకలాపాలను ఉధృతం చేశారు. ఫలితంగా ఇంటిపోరు తారస్థాయికి చేరి పార్టీ పరిస్థితి పూర్తిగా దిగజారిపోతోంది. ఈ నేపథ్యంలో వర్గపోరుకు చెక్‌పెట్టి నియోజకవర్గ ఇన్చార్జిని నియమించకపోతే పార్టీ పూర్తిగా అడుగంటిపోయే ప్రమాదం ఉందని జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమ అధినేతకు చెప్పడంతో అత్యవసరంగా ఈ సమీక్ష సమావేశాన్ని ఏర్పాటుచేసినట్లు తెలుస్తోంది. ఇన్చార్జి నియామకం జరిగేనా!? నియోజకవర్గంలో ఇప్పటికే మంత్రి సారథి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. జనవరి 2 నుంచి వైఎస్సార్ సీపీ గడపగడపకూ సమైక్యాంధ్ర ప్రచార కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఈ నేపథ్యంలో పార్టీకి ఇన్చార్జిని నియమించి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టాలని టీడీపీ భావిస్తోంది. అధినేత నుంచి పిలుపు రావడంతో ముఖ్యనేతలందరూ రాజధానికి పయనమయ్యారు. ‘వస్తున్నా.. మీ కోసం’లో భాగంగా కనుమూరు వద్ద నియోజకవర్గ పరిస్థితిపై సమీక్ష జరిపారు. ఇన్చార్జిని నియమించాలని పలువురు కోరారు. ఇంతవరకూ ఆ పనిచేయలేకపోయారు. కార్యకర్తలు గురువారం సమావేశంలోనైనా ఇన్చార్జిపై స్పష్టమైన ప్రకటన ఉంటుందో లేదోనన్న మీమాంసకు లోనవుతున్నారు. తెలంగాణ అంశంపై అధినేత ద్వంద్వ వైఖరిని కూడా పార్టీ దిగువస్థాయి కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏ దిద్దుబాటు చర్య తీసుకున్నా పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేయడం ఓ సవాలేనని వారు భావిస్తున్నారు. -
తెలంగాణకు బీజం వేసింది వైఎస్సే: వైవీబీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బీజం వేసింది వైఎస్ రాజశేఖరరెడ్డి అని తెలుగుదేశం అధికార ప్రతినిధి వైవీబీ రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. గురువారం ఎన్టీఆర్ భవన్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకుండా చేసేందుకు 1999లో జి.చిన్నారెడ్డి నేతృత్వంలో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేసేలా వైఎస్ ప్రోత్సహించారన్నారు. 2004లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో తెలంగాణ ఏర్పాటు అంశాన్ని ప్రస్తావించారని, 2009 ఎన్నికలకు ముందు అసెంబ్లీలో రోశయ్య నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చే స్తున్నట్లు ప్రకటించారన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ తొలి ప్లీనరీలో తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేశారని, షర్మిల పాదయాత్ర మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రవేశించిన సందర్భంగా పుల్లూరులో సభలో తమ పార్టీ తెలంగాణకు వ్యతిరేకం కాదని వైఎస్ విజయమ్మ చెప్పారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆయా అంశాలకు సంబంధించిన వీడియో టేపులను ప్రదర్శించారు. రోశయ్య నేతృత్వంలో కమిటీ వేస్తున్నట్టు అసెంబ్లీలో ప్రకటించిన సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ మాట్లాడిన మాటల్లో కొన్నింటిని మాత్రమే వీడియోలో ప్రదర్శించారు. రాష్ట్రాన్ని విభజించాల్సి వస్తే ఇరు ప్రాంతాల ప్రజల మనోభావాలు తెలుసుకోవాలని ఆయన చెప్పిన విషయాన్ని చూపలేదు. ఈ ప్రశ్నలకు బదులేది? సాక్షి ప్రతినిధిని ఈ విలేకరుల సమావేశానికి ఆహ్వానించలేదు. వివిధ రూపాల్లో సేకరించిన సమాచారం మేరకు ఈ వార్త ఇస్తున్నాం. ఒకవేళ ఈ సమావేశానికి ఆహ్వానించి ఉంటే ఈ క్రింది ప్రశ్నలను అడిగి సమాధానాలు రాబట్టేందుకు ప్రయత్నించేది. *2004 ఎన్నికల్లో ప్రజలు టీడీపీని తిరస్కరించడంతో తిరిగి 2009 సాధారణ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలనే ఏకైక లక్ష్యంతో 2008 అక్టోబర్‌లో తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారా లేదా? * 2009లో కేసీఆర్ ఆమరణ దీక్ష చేస్తున్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి కె. రోశయ్య నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి హాజరైన మీ పార్టీ ప్రతినిధులు తెలంగాణ ఏర్పాటును కోరింది వాస్తవం కాదా? * వస్తున్నా మీకోసం పాదయాత్రను తెలంగాణ ప్రజలు అడ్డుకుంటారన్న భయంతో 26 సెప్టెంబర్ 2012న ప్రధానికి తెలంగాణ అంశాన్ని పరిష్కరించాలని మీ అధినేత లేఖ రాసింది నిజమా కాదా? * కేంద్రం హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి వెళ్లిన కడియం శ్రీహరి, యనమల రామకృష్ణుడు తెలంగాణ ఇవ్వాల్సిందేనని చెప్పలేదా? * కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసిన తర్వాత విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన చంద్రబాబు.. సీమాంధ్రలో నూతన రాజధాని ఏర్పాటుకు నాలుగైదు లక్షల కోట్ల ఖర్చును కేంద్రమే భరించాలని డిమాండ్ చేశారా, లేదా? * సీమాంధ్రలో ఉద్యమం తీవ్రరూపం దాల్చినప్పుడు 10 రోజుల పాటు చంద్రబాబు ఏమీ మాట్లాడకుండా ఇంటికే పరిమితమైన విషయం వాస్తవం కాదా? * తెలుగువారి ఆత్మగౌరవం కోసం దివంగత ఎన్టీఆర్ ఎంతగానో పోరాడారు. ఆయన్ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు ఇప్పుడు ఆత్మగౌరవ యాత్ర చేసే అర్హత ఉందంటారా?