విభజన అంకం ముగిసిందని, ఆంధ్రప్రదేశ్ను ఎలా ఆదుకోవాలన్నదానిపై ఆలోచిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు.
హిందూపురం: విభజన అంకం ముగిసిందని, ఆంధ్రప్రదేశ్ను ఎలా ఆదుకోవాలన్నదానిపై ఆలోచిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. రాష్ట్ర విభజన అనంతరం రాహుల్ తొలిసారి సీమాంధ్ర పర్యటనకు వచ్చారు. బుధవారం హిందూపురంలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ మాట్లాడారు.
రాష్ట్ర విభజనకు అన్నీ పార్టీలు నిర్ణయం తీసుకున్న తర్వాతే కాంగ్రెస్ ముందుకెళ్లిందని చెప్పారు. సీమాంధ్రకు ప్రత్యేక హోదా కల్పించడానికి కొంతమంది వ్యతిరేకించినా సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ తాను కట్టుబడిఉన్నామని రాహుల్ తెలిపారు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ ఆరునెలల్లోనే కొత్త రాజధానిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టను త్వరలో పూర్తి చేస్తామని, ఏడున్నర లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. ఈ సభలో ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. రాహుల్ హిందీలో ప్రసంగించగా, రఘువీరా రెడ్డిలో తెలుగులో అనువాదం చేశారు.