అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది.
హిందూపూర్: అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. హిందూపురం అసెంబ్లీ స్థానంలో టీడీపీ అభ్యర్థి బాలకృష్ణపై వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి నవీన్ నిశ్యల్ 748 ఓట్ల ఆధిక్యం సాధించారు. కదిరి, తాడిపత్రి, ఉరవకొండ, రాయదుర్గం, గుంతకల్లులో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.