ఓం లిక్కరాయనమః... ఓం క్వార్టరాయనమః
టీడీపీ కార్యక్రమం ఏదైనా .... పార్టీ మీటింగైనా.. రోడ్ షో అయినా కార్యకర్త మెడలో పచ్చ కండువా ఉంటే చేతిలో మందు బాటిల్ ఉండి తీరాలి. అదీ ప్రస్తుతం పార్టీ కార్యకర్తల పరిస్థితి. ఓం లిక్కరాయనమః, ఓం క్వార్టరాయనమః మంత్రాలతో టీడీపీ కార్యకర్తలు కాలం గడిపేస్తున్నారు.
మంగళగిరి, ఆచంట, కదిరి, పలమనేరు, చిత్తూరు..... ఎనీ డిస్ట్రిక్ట్... ఎనీ సెంటర్... సుక్క పడిందా లేదా అన్నదే టీడీపీ క్యాడర్ కి ముఖ్యం. మందు గొంతులో దిగుతుంటే ఆ కిక్కే వేరప్పా... అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. చాలా చోట్ల రోడ్‌షోలు, బహిరంగసభలు వదిలిపెట్టి మద్యం షాపుల్లో దూరిపోతున్నారని లోకం కోడై కూస్తోంది.
ఉదాహరణకి పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో చంద్రబాబు రోడ్ షో చేపట్టారు. మందుతో విందు చేసుకుంటూ ఖుషీ చేసుకున్నారు తెలుగుతమ్ముళ్లు. చిత్తూరు జిల్లా పలమనేరులోనైతే తెలుగుదేశం కార్యకర్తలు గుంపులు గుంపులుగా మద్యం దుకాణాల ముందు వాలిపోయారు. ఇక మదనపల్లెలో తెలుగు తమ్ముళ్ల ముచ్చటే వేరు. ఓ వైపు.... తమ్ముళ్లూ అంటూ చంద్రబాబు గొంతు చించుకుంటూ ఉంటే తమ్ముళ్లు మాత్రం....... ఆ మాటలు తమకు కాదనుకున్నట్లున్నారు. కొందరు సభలోనే హాయిగా బజ్జుంటే మరి కొందరు తాగి ఊగిపోయారు.
ఇక కుప్పంలో చంద్రబాబు సభలోనే తమ్ముళ్లు కొట్లాటకు దిగారు. సర్దిచెప్పడానికి వచ్చిన పోలీసులపైనా తమ ప్రతాపం చూపారు. ఒకరినొకరు తోసుకుంటూ, కుర్చీలు విసిరేసుకుంటూ రచ్చ రచ్చ చేశారు.