గుంటూరు మెడికల్, న్యూస్‌లైన్ : కేవలం ఓట్ల కోసం, అధికారం కోసం జిల్లాకు వచ్చిన మోసగాళ్లను నమ్మవద్దని వైఎస్సార్ కాంగ్రెస్ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త వల్లభనేని బాలశౌరి ప్రజలకు సూచించారు.
అవి చేస్తాం, ఇవి చేస్తాం అంటూ మభ్యపెడుతున్న టీడీపీ నాయకులకు ఓటుతో బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. శనివారం గుంటూరు నలందానగర్‌లోని తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజకీయాలకు, ఉద్యమాలకు, విప్లవాలకు గుంటూరు జిల్లా పెట్టింది పేరు అని, ఇక్కడి ప్రజలు చాలా వివేకవంతులని చెప్పారు. చంద్రబాబు మాయ పథకాలను ప్రజలు విశ్వసించబోరన్నారు.
అధికారం కోసం మైనార్టీలు, బీసీలు, కాపులకు ప్రత్యేక బడ్జెట్‌లు అని ప్రకటిస్తూ రోజుకో కొత్త పథకం ప్రకటిస్తున్న తీరును చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అధికారం కోసం ఏగడ్డి క రవటానికైనా సిద్ధపడతారని విమర్శించారు.
రాష్ర్టంలో విశ్వసనీయత ఉన్న ఏకైక పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ అని చెప్పారు. డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేయటం ద్వారా మహిళలు ఆర్ధికంగా ఎదుగుతారని తెలిపారు. సీమాంధ్ర కేంద్రంగా ఉన్న గుంటూరు జిల్లాను ఎలా అభివృద్ధి చేయాలా అని ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో పార్టీ నాయకులు లాలుపురం రాము, థామస్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.
మోసగాళ్లకు ఓటుతో బుద్ధి చెప్పండి
Published Sun, Mar 23 2014 2:19 AM | Last Updated on Fri, Aug 10 2018 8:01 PM
Advertisement
Advertisement