తెలంగాణ రాష్ట్రాన్ని స్పెషల్ కేటగిరీ కింద ప్రకటించి వ్యవసాయం, పరిశ్రమలు, యువతకు ఉపాధి.. ఇలా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేయాలని స్టూడెంట్ ఫర్ లిబర్టీ సౌత్ ఇండియా అధ్యక్షుడు జి.వెంకటేష్ అన్నారు.
విద్యారణ్యపురి, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్రాన్ని స్పెషల్ కేటగిరీ కింద ప్రకటించి వ్యవసాయం, పరిశ్రమలు, యువతకు ఉపాధి.. ఇలా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేయాలని స్టూడెంట్ ఫర్ లిబర్టీ సౌత్ ఇండియా అధ్యక్షుడు జి.వెంకటేష్ అన్నారు. ఈ మేరకు ఆదివారం నగరంలో నిర్వహించిన స్టూడెంట్ ఫర్ లిబర్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. తెలంగాణలో యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించకపోతే అమరవీరుల త్యాగఫలం, రాష్ట్ర ఏర్పాటుకు అర్థం ఉండదన్నారు.
దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు 1991లో తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణల వల్ల ప్రపంచంలోనే దేశం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందన్నారు. పీవీ సంస్కరణల స్ఫూర్తితోనే గుజరాత్, మధ్యప్రదేశ్, ఒడిశా లాంటి రాష్ట్రాలు అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నాయని వివరించారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ వారు ఆర్థికంగా నిలదొక్కుకునేలా పాలకవర్గాలు కృషి చేయాలన్నారు.