ఎడారి బతుకులు
జన పథం: గల్ఫ్ దేశాల్లోని తెలుగు ప్రజల రక్షణ నా బాధ్యత. అధికారంలోకి రాగానే జైళ్లలో మగ్గుతున్న వారిని స్వదేశానికి రప్పిస్తా. వారికి ఆర్థిక ఆసరా కల్పిస్తా. గల్ఫ్‌లో మరణించిన వారి కుటుంబాలకు అండగా నిలుస్తా. బోగస్ ఏజెంట్లను అరికడతా. భవిష్యత్తులో ఉపాధి కోసం ఎవరూ గల్ఫ్‌కు వెళ్లే అవసరం లేకుండా చూస్తా.
- వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి
గల్ఫ్ దేశాల్లో ప్రమాదవశాత్తు మరణించినవారి శవాలు ప్రస్తు తం 180 వరకు ఉన్నాయి.వాటి కోసం నెలల తరబడి ఎదురు చూడ లేక వారి కుటుంబ సభ్యులు అనుభవిస్తున్న వేదన వర్ణనాతీతం. వలస దేశంలో కష్టాలకు తట్టుకోలేక, వెనక్కి వచ్చే దారిలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారు కొందరైతే, ప్రమాదవశాత్తు మరణిస్తున్న వారు మరికొందరు. ఇలా మరణించిన వారి శవాలు ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లో 180 ఉన్నాయి. కనీసం ఆఖరి చూపునకు కూడా నోచుకోలేక, నెలల తరబడి శవ జాగరణ చేయలేక వారి కుటుంబ సభ్యులు అనుభవిస్తున్న వేదన వర్ణనాతీం. తెలంగాణలోని ప్రతి పల్లెలో ఈ విషాద ఘటనలు కనిపిస్తాయి. పెద్ద దిక్కు దూర దేశంలో తల్లడిల్లుతుంటే వారి కుటుంబ సభ్యులు ఇక్కడ దిక్కుతోచక అలమటిస్తున్నారు.
కరీంనగర్, నెట్‌వర్‌క: ఉన్న ఊళ్లో బతుకు కురువై పరాయి దేశాలకు వెళ్లిన ‘వలస’ ఓటర్లు ప్రస్తుత ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు పదిలక్షల మంది ఎడారి దేశాలకు వలస వెళ్లారు. వీరి కుటుంబ సభ్యులను కూడా కలుపుకొంటే దాదాపు 52లక్షల మంది ఓటర్లు ఎన్నికల్లో అభ్యర్థుల తలరాతలు మార్చనున్నారు. ఎన్నికలప్పుడు తప్ప ఏనాడూ తమ సమస్యలు ప్రస్తావించని నేతల పనిపట్టేందుకు ఓటును ఆయుధంగా వాడేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం స్వగ్రామాలకు పయనమవుతున్నారు.
వ్యవసాయంలో చితికిపోయి.. అంతవరకు తలెత్తుకు తిరిగిన ఊళ్లో కూలీలుగా బతకడం ఇష్టం లేక వలస పోతున్న బడుగు జీవుల్లో నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల వారే అధికం. దేశం విడిచి విమానమెక్కుతున్న వీరు పాస్‌పోర్టు మొదలు వీసా వరకు అన్నింటా మోసపోతున్నారు. బ్రోకర్లు, ఏజెంట్ల మోసాలు.. సరైన పత్రాలు లేక, వేతనం అందక.. వీధుల పాలై దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారు.
26 సెగ్మెంట్ల పరిధిలో..
తెలంగాణలోని ఆరు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని 26 అసెంబ్లీ సెగ్మెంట్లలో గల్ఫ్ బాధితులున్నారు. కరీంనగర్ జిల్లాలో సిరిసిల్ల, కోరుట్ల, జగిత్యాల, వేవుులవాడ, ధర్మపురి, హుజూరాబాద్, చొప్పదండి, వూనకొండూరు, కరీంనగర్, పెద్దపల్లి, రావుగుండం నియోజకవర్గాల్లో గల్ఫ్ బాధితులు కోకొల్లలు. మెదక్ జిల్లాలో మెదక్, దుబ్బాక, సిద్ధిపేట, ఆదిలాబాద్ జిల్లాల్లో నిర్మల్, ఖానాపూర్, భైంసా నియోజకవర్గాలు, నిజావూబాద్ జిల్లాలో జుక్కల్ మినహా ఎనిమిది నియోజకవర్గాల్లో గల్ఫ్ బాధితులున్నారు. ప్రవాస భారతీయుుల హక్కులు, సంక్షేవు వేదిక ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని 26 నియోజకవర్గాలను గల్ఫ్ కార్మిక ప్రభావిత సెగ్మెంట్లుగా గుర్తించి దీనికి గల్ఫ్ జోన్‌గా పేరు పెట్టింది.
కోటిమంది వలస జీవులు
యుూఏఈ సహా ఇతర గల్ఫ్ దేశాల్లో ఉంటున్న వున దేశ కార్మికుల సంఖ్య దాదాపు కోటికి చేరింది. 2012 అక్టోబరు వరకు ఈ సంఖ్య 60 లక్షలు ఉన్నట్లు లోక్‌సభలో విదేశీ వ్యవహారాలశాఖ వుంత్రి వయలార్ రవి ప్రకటించారు. వీరిలో తెలంగాణ జిల్లాల నుంచి 12 లక్షల మంది వరకు ఉండగా, అందులో దాదాపు 3.75 లక్షల వుంది కరీంనగర్ జిల్లా వారే.
హామీలు.. నీటి మూటలు
వలస జీవుల వెతలు పరిష్కరిస్తామన్న నేతల మాటలు నీటి మూటలవుతున్నాయి. రాష్ట్రం లో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రవాసాంధ్ర శాఖ ఉత్తుత్తిగానే మిగిలిపోయింది. యూఏఈ ప్రభుత్వం 2012 డిసెంబర్ 3వ తేదీ నుంచి 2013 ఫిబ్రవరి 3 వరకు అమ్నెస్టీ(క్షమాభిక్ష) విధించినా మన ప్రభుత్వం పెద్దగా స్పందించలేదు. అప్పటి మంత్రి శ్రీధర్‌బాబును దుబాయ్ పంపి సర్కారు తరఫున 27 వుందికి మాత్రమే టికెట్లు అందజేసి చేతులు దులుపుకొంది.
ఆశపడి వెళ్లి.. ఆగమయ్యాడు
ఈ యువకుడి పేరు కొంకటి రాజు. గల్ఫ్ ఏజెంట్ చేతిలో మోసపోయి.. మూడు నెలలు జైలు శిక్ష అనుభవించి తిరిగి స్వగ్రామానికి చేరుకున్నాడు. రాజుది కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం రాళ్ల పేట. ఎడారి దేశం వెళ్లి నాలుగు రాళ్లు సంపాదించుకుందామని ఆశపడ్డాడు. చిత్తూరు జిల్లాకు చెందిన గల్ఫ్ ఏజెంట్ రమణను ఆశ్రయించాడు. అప్పుచేసి లక్షరూపాయలు సమర్పించాడు. నెలకు రూ.12వేలు జీతం వస్తుందన్న ఆశతో మస్కట్ విమానమెక్కితే అక్కడికెళ్లాక నెలకు రూ.ఐదువేలే చేతిలో పెట్టడంతో నిర్ఘాంతపోయాడు. ఆ బాధ నుంచి తేరుకోకమునుపే తమ దేశంలో అక్రమంగా ఉంటున్నాడని పోలీసులు అరెస్టు చేసి మూడు నెలలు జైల్లో పెట్టారు. పది నెలల క్రితం విడుదలై తిరిగి స్వగ్రామం చేరుకున్నాడు. గల్ఫ్ పేరిట నెత్తిపై పడిన రూ.రెండు లక్షల అప్పు తీర్చేందుకు ఇప్పుడు కూలి పనులు చేస్తున్నాడు. - న్యూస్‌లైన్, సిరిసిల్ల
వలసలకు ఆద్యుడు
- చంద్రబాబు హయాంలో 1995 నుంచి 2004 మధ్య కరువు తాండవించింది. పనులు లేని గ్రామీణులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోకపోవడం వల్ల వలసలు ఎక్కువయ్యాయి.
- 1995లో జిల్లా కేంద్రం నుంచి రోజుకో బస్సు ముంబయికి వెళ్తే కరువు తీవ్రతతో పాటు బస్సుల సంఖ్యా పెరిగింది. సిరిసిల్ల, కోరుట్ల, మెట్‌పల్లి, జగిత్యాల, వేములవాడ, కరీంనగర్ డిపోల నుంచి రోజూ ఎనిమిది బస్సుల్లో 400 మంది ముంబయికి పనుల కోసం వెళ్లేవారు.
- ముంబయి కన్నా కొంత మెరుగైన వేతనాలుండడంవల్ల దుబాయి, మస్కట్, సౌదీ అరేబియా, అబుదాబి, ఖతర్, బహ్రెయిన్ వంటి గల్ఫ్ దేశాలకు వలసలు మొదలయ్యాయి.
- యువకులంతా వలస వెళ్లగా అప్పట్లో గ్రామాల్లో శవాన్ని మోసేందుకు సైతం మగవారు లేని దుస్థితి కనిపించేది. ముస్తాబాద్ మండలం రాంరెడ్డిపల్లిలో చాలాకాలం వృద్ధులు తప్ప యువకులు కనిపించలేదు. కరీంనగర్ జిల్లా చందుర్తి మండలం బండపల్లిలో ఇంటికొకరు గల్ఫ్‌కు వెళ్లారు.
- గల్ఫ్ ఏజెంట్ల మోసాలు అప్పుడే మొదలయ్యాయి. విజిటింగ్ వీసాలపై దుబాయి, మస్కట్ తీసుకెళ్లారు. ఆ వీసాల మీద వెళ్లి పోలీసులకు చిక్కి వేలాది మంది జైలుపాలయ్యారు.
- వీసాలు ఇప్పిస్తామంటూ లెసైన్స్‌లు లేకుండానే బోర్డులు పెట్టి ట్రావెల్ ఏజెన్సీలు నడిపించారు. వీరిపై చర్యలు తీసుకోకపోవడంతో వేలాది మంది గ్రామీణులు ఆర్థికంగా నష్టపోయారు.
ఛార్జీలు కూడా ఇవ్వలేదు
- గల్ఫ్ బాధితుల విషయంలో కేరళ ప్రభుత్వం చొరవ చూపి గల్ఫ్‌లోని కేరళ వాసులందరి విమాన చార్జీలను చెల్లించింది. తెలుగు వారికీ డబ్బులు చెల్లించాలని కిరణ్‌కుమార్‌రెడ్డిని కోరినా పట్టించుకోలేదని కేంద్రమంత్రి వయలార్ రవి అప్పట్లో ప్రకటించారు.
‘ప్రత్యేక’ భరోసా
- మహానేత వైఎస్ రెండోసారి అధికారంలోకి రాగానే గల్ఫ్ బాధితులకు భరోసా ఇచ్చే కార్యాచరణ ప్రారంభించారు. కేరళ ప్రభుత్వం తరహాలో 2009లో ప్రవాసాంధ్ర శాఖను ఏర్పాటు చేశారు.
- ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచే ఎక్కువగా వలసలు ఉండటంవల్ల కరీంనగర్ జిల్లాకు చెందిన శ్రీధర్‌బాబుకు ప్రవాసాంధ్ర వ్యవహారాల శాఖను అప్పగించారు.
- తెలంగాణలోని అన్ని జిల్లాల్లో గల్ఫ్ ఏజెంట్లు, బ్రోకర్లను గుర్తించి.. వారిపై కేసులు నమోదు చేశారు. చంద్రబాబు హయూంలో వెలిసిన బోగస్ ఏజెన్సీలకు తాళం పడింది.
- గల్ఫ్‌లో వురణించిన కార్మికుల కుటుంబాలకు లక్ష రూపాయుల పరిహారం అందించాలని ఉత్తర్వులు జారీ చేశారు. 2009 తర్వా త - గల్ఫ్‌లో వురణించిన కరీంనగర్ జిల్లాకు చెందిన 103 వుంది కార్మికుల కుటుంబాలకు లక్ష రూపాయుల పరిహారం అందింది. అలాగే అన్ని కలెక్టరేట్లలో ప్రవాసాంధ్ర సెల్ ఏర్పాటు చేశారు.