సాక్షి ప్రతినిధి, కరీంనగర్: నామినేషన్ల గడువుకు ఆఖరిరోజు మిగిలింది. ప్రధాన పార్టీలన్నీ అర్థరాత్రి వరకు అభ్యర్థిత్వాల కసరత్తుపైనే కుస్తీ పట్టారుు. కాంగ్రెస్ పార్టీ ఒకరోజు వుుందుగానే జిల్లాలోని రెండు లోక్‌సభతో పాటు 13 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అందరికంటే వుుందుగా అభ్యర్థుల జాబితా విడుదల చేసిన టీఆర్‌ఎస్.. పెండింగ్‌లో పెట్టిన రెండు స్థానాలకు వుంగళవారం అభ్యర్థులను ఖరారు చేసింది.
పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్వీ నాయుకుడు బాల్క సువున్‌ను, చొప్పదండి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి బొడిగె శోభకు టిక్కెట్లు ఇచ్చింది. టీడీపీ-బీజేపీ పొత్తులో భాగంగా కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గంతో పాటు సిరిసిల్ల, వేవుులవాడ, కోరుట్ల, రావుగుండం, ధర్మపురి, కరీంనగర్, హుస్నాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లు బీజేపీకి దక్కారుు. ఇక్కడ ఎవరెవరిని బరిలోకి దింపాలో బీజేపీ వుంగళవారం రాత్రి వరకు కసరత్తు కొనసాగించింది.
కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా వూజీ వుంత్రి సీహెచ్.విద్యాసాగర్‌రావుకు పార్టీ టిక్కెట్టు ఖరారైంది. గతంలో వరుసగా రెండుసార్లు కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచిన ఆయన 2009 ఎన్నికల్లో వేవుులవాడ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయూరు. ఈసారి ఈ సీటుకు చివరి వరకు పోటీపడ్డ పార్టీ జాతీయు ప్రధానకార్యదర్శి వుురళీధర్‌రావు భంగపడ్డారు. కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సురభి భూంరావు, ధర్మపురి నుంచి కన్నం అంజయ్యుకు పార్టీ టిక్కెట్లు ఖరారయ్యూరుు. అర్ధరాత్రి వరకు కరీంనగర్, సిరిసిల్ల, వేవుులవాడ, హుస్నాబాద్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదు.
కాంగ్రెస్ టిక్కెట్టు ఆశించి భంగపడ్డ కేకే.వుహేందర్‌రెడ్డిని సిరిసిల్ల నుంచి, ఆది శ్రీనివాస్‌ను వేవుులవాడ నుంచి పోటీకి దింపే అవకాశవుుంది. సిరిసిల్లలో కొట్టాల మోహన్‌రెడ్డి భార్య ఆకుల విజయు, వేవుులవాడలో ప్రతాప రావుకృష్ణ పార్టీ టిక్కెట్లు ఆశిస్తున్నారు. వుంగళవారం రాత్రి వరకు జరిగిన వుంతనాల్లో సిరిసిల్ల నుంచి కేకే.మహేందర్‌రెడ్డికి, వేవుులవాడ నుంచి ఆది శ్రీనివాస్‌కు పార్టీ లైన్ క్లియుర్ చేసినట్లు తెలిసింది.
పెండింగ్‌లో పెట్టిన స్థానాలకు సంబంధించి టీడీపీ అర్ధరాత్రి సవుయుం వరకు కసరత్తు చేస్తూనే ఉంది. పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుంచి వుంచిర్యాలకు చెందిన డాక్టర్ శరత్‌కువూర్‌ను బరిలోకి దింపినట్లు సవూచారం. హుజూరాబాద్‌లో ఆ పార్టీ ఇన్‌చార్జి , వూజీ వుంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి పోటీకి దిగుతారనే ప్రచారం జరిగినప్పటికీ... కాంగ్రెస్ జాబితా వెలువడగానే ఆయున తన నిర్ణయుం వూర్చుకున్నట్లు తెలుస్తోంది. కేవలం జిల్లాలో పార్టీ ప్రచారానికి పరిమితమై పోటీకి దూరంగా ఉండాలని పెద్దిరెడ్డి భావిస్తున్నట్లు తవుు్మళ్లలో చర్చ జరుగుతోంది. ప్రత్యావ్నూయుంగా దివంగత వూజీ వుంత్రి వుుద్దసాని దామోదర్‌రెడ్డి కువూరుడు కశ్యప్‌రెడ్డిని పార్టీ ఇక్కడ పోటీకి దించింది. వురోవైపు చొప్పదండి నుంచి కాంగ్రెస్ టిక్కెట్ ఆశించిన మేడిపల్లి సత్యం పేరును ఖరారు చేసింది. ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేట్లకు చెందిన సత్యం ఓయూ జేఏసీ నాయకుడిగా వ్యవహరించారు. చొప్పదండి సిట్టింగ్ ఎమ్మెల్యే సుద్దాల దేవయ్యు కాంగ్రెస్ తరఫున పోటీకి దిగటంతో.. టీడీపీ వుల్యాల నుంచి జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేసిన వ్యూక లక్ష్మణ్ వైపు మొగ్గు చూపినా.. చివరకు నిర్ణయం మార్చుకుంది.
పొత్తులో భాగంగా తవుకు ఒక్క సీటు కూడా ఇవ్వకపోవటంతో కాంగ్రెస్ చేతిలో సీపీఐ భంగపడింది. చివరివరకు హుస్నాబాద్ సీటుకు పట్టుబట్టిన ఆ పార్టీ నేత చాడ వెంకటరెడ్డి కాంగ్రెస్‌పై పోటీకి దిగుతారనే ప్రచారం జరుగుతోంది. కానీ ఇందుకు పార్టీ నుంచి అనుమతి లభించలేదని తెలిసింది.
కాంగ్రెస్‌లో టిక్కెట్ల పంపిణీ అసవ్ముతి జ్వాలలు రాజేసింది. పెద్దపల్లి నుంచి వూజీ ఎమ్మెల్యే గీట్ల వుుకుందరెడ్డి, కోరుట్ల నుంచి జువ్వాడి నర్సింగరావు, రావుగుండం నుంచి కౌశికహరి, వేవుులవాడ నుంచి ఏనుగు వునోహర్‌రెడ్డి, హుజురాబాద్‌లో తుమ్మేటి సమ్మిరెడ్డి తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీకి సిద్ధవుయ్యూరు.
టిక్కెట్లతోనే కుస్తీ
Published Wed, Apr 9 2014 3:45 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement