తీర ప్రాంతంలోని మత్స్యకారుల అభ్యున్నతికి తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తారు.
నర్సాపురం: తీర ప్రాంతంలోని మత్స్యకారుల అభ్యున్నతికి తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తారని నర్సాపురం లోక్‌సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంకా రవీంద్రనాథ్, అసెంబ్లీ అభ్యర్థి కొత్తపల్లి సుబ్బారాయుడు తెలిపారు. నర్సాపురంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణం వైఎస్‌ఆర్ సీపీ ద్వారానే సాధ్యమన్నారు.
ఈ ఎన్నికల్లో సీలింగ్ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి తమను గెలిపించాలని ఓటర్లను వారు అభ్యర్థించారు. రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందాలన్నా, పేదల కష్టాలు తీరాలన్నా జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని అన్ని వర్గాల వారు భావిస్తున్నారన్నారు.