16న విజయమ్మ పర్యటన
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఎన్నికల ప్రచారం నిమిత్తం ఈనెల 16న జిల్లాకు రానున్నారు. చింతలపూడి,
సాక్షి ప్రతినిధి, ఏలూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఎన్నికల ప్రచారం నిమిత్తం ఈనెల 16న జిల్లాకు రానున్నారు. చింతలపూడి, గోపాలపురం, కొవ్వూరు నియోజకవర్గాల్లో ‘వైఎస్సార్ జనభేరి’ పేరిట ఎన్నికల సమర శంఖారావం పూరిస్తారు. బుధవారం ఉదయం 10గంటలకు చింతలపూడిలో జరిగే బహిరంగ సభలో ఆమె పాల్గొంటారు. అనంతరం జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం వెళతారు. అక్కడ రోడ్ షో నిర్వహించి, గోపాలపురం నియోజకవర్గంలో ప్రవేశిస్తారు. మధ్యాహ్నం 3.30 గంటలకు గోపాలపురంలో రోడ్ షో నిర్వహిస్తారు. సాయంత్రం 4.30 గంటలకు కొవ్వూరు నియోజకవర్గం పరిధిలోని తాళ్లపూడి వెళతారు. అక్కడ నిర్వహించే సభలో విజయమ్మ ప్రసంగిస్తారు. విజయమ్మ పర్యటనకు మూడు నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విసృ్తత ఏర్పాట్లు చేస్తున్నాయి.