
బాలీవుడ్ అందాల భామ ఆలియా భట్.. రణ్‌బీర్, అయాన్‌తో కలిసి దిగిన ఓ ఫోటోను సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు. దానితో పాటు ఇది ఆరంభం మాత్రమే అని రాశారు. రణ్‌బీర్, ఆలియా జంటగా ‘బ్రహ్మాస్త్ర’ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ బల్గేరియాలో జరుగుతుంది. షూటింగ్ స్పాట్‌లో దిగిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు.
అయితే ఈ చిత్ర షూటింగ్‌లో భాగంగా ఆలియా భట్ గాయపడిన విషయం తెలిసిందే. యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సందర్భంలో చిన్న ప్రమాదం చోటు చేసుకుంది. దాంతో ఆమె భుజానికి దెబ్బ తగిలింది. కనీసం 15 రోజుల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. కానీ అనుకున్న సమయాని కంటే ముందే కోలుకున్న ఆలియా షూటింగ్‌లో పాల్గొని సినిమా మొదటి షెడ్యుల్‌ను పూర్తి చేశారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బిగ్‌బీ అమితాబ్ కూడా నటించనున్నారు. రణ్‌బీర్, ఆలియా, అమితాబ్ కలిసి నటించడం ఇదే మొదటి సారి కావడం విశేషం. ఈ చిత్రాన్ని 2019 ఆగస్టు 15న విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment