
విచక్షణతోనే యాంటీ బయాటిక్స్ వాడాలి!
ఇటీవల యాంటీ బయాటిక్స్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఎవరికి వారు మందుల పేర్లు తెలుసుకుని అనారోగ్యం రాగానే యాంటీ బయాటిక్స్‌ని వాడేస్తున్నారు.
అవగాహన
ఇటీవల యాంటీ బయాటిక్స్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఎవరికి వారు మందుల పేర్లు తెలుసుకుని అనారోగ్యం రాగానే యాంటీ బయాటిక్స్‌ని వాడేస్తున్నారు. దాంతో ఆ మందు అరకొరగా పనిచేస్తుంది. దేహంలో చేరిన వ్యాధి కారక వైరస్ యాంటీ బయాటిక్ నుంచి తనను తాను రక్షించుకునే శక్తిని పెంచుకుంటుంది. ఆ తర్వాత వ్యాధి తగ్గాలంటే మరింత శక్తిమంతమైన మందును వాడక తప్పదు. మరో సమస్య ఎలా ఉంటుందంటే... డాక్టరు సూచించిన మందులనే వాడుతుంటారు.
కానీ రెండు రోజుల్లో వ్యాధి తగ్గుముఖం పట్టగానే ఆపేస్తారు. ఆ మందులు అలా ఉంటే మరోసారికి వాడుకోవచ్చనే ఆదా పద్ధతన్నమాట. తగినంత మందు పడకపోతే వ్యాధికారక వైరస్ పూర్తిగా నశించకపోగా తిరిగి శక్తిని పుంజుకుంటుంది. ఈ వాడకంలో వ్యాధి కారక వైరస్‌ను సమర్థంగా నిర్మూలించే యాంటీ బయాటిక్‌నే వాడుతున్నామా లేదా అనేది ఆయారంగాల్లో నిపుణులకు తప్ప సాధారణంగా ఇతరులకు తెలియదు.
ఇలాంటి విషయాల మీద అవగాహన తీసుకురావడానికి యూరప్ దేశాల్లో ‘యూరోపియన్ యాంటీ బయాటిక్ అవేర్‌నెస్ డే’ని నిర్వహిస్తున్నారు. ఏటా నవంబరు18వ తేదీన యాంటీబయాటిక్స్ వాడకానికి ఓ పద్ధతి ఉంటుందనీ, బాధ్యతతో వాడాలనీ సమావేశాలు పెట్టి మరీ తెలియచేస్తారు.