
చేదుగా ఉన్నప్పటికీ చాలా మంది కాకరకాయను ఇష్టపడుతుంటారు. దానిలోని చేదు విరిచేసేలా ఫ్రై చేయడమో, మజ్జిగలో వేసి ఉడికించడమో లేదా కోశాక ఉప్పు, పసుపు వేయడమో చేస్తారు.
కాకరకాయ డయాబెటిస్ రోగులకు ఎక్కువ మేలు చేస్తుంది. రక్తంలోని చక్కెరను నియంత్రించే గుణం కాకరలో ఉంది. అంతేకాదు... కాకరతో మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటిలో ఇవి కొన్ని...
♦ కాకరకాయలో ఇన్సులిన్ లాంటి రసాయనం (కాంపౌండ్) ఉంటుంది. దీన్ని పాలిపెపై్టడ్–పీ లేదా పీ–ఇన్సులిన్ అంటారు. ఇది స్వాభావికంగా చక్కెరవ్యాధిని నియంత్రిస్తుంది. టైప్–1 డయాబెటిస్ ఉన్న చిన్న పిల్లల్లో సైతం ఇది చక్కెరను నియంత్రిస్తుందని తేలింది.
♦ కాకర రక్తంలోని కొలెస్ట్రాల్‌ను కూడా సమర్థంగా నివారిస్తుంది. గుండెపోటును నివారిస్తుంది.
♦ కాకరలో పొటాషియమ్ పాళ్లు పుష్కలం. ఇది రక్తపోటును నియంత్రించి, పక్షవాతాన్ని నివారిస్తుంది.
♦ కాకరలోని శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్–ఏ, విటమిన్–సి, బయోటిన్, జింక్ వల్ల చర్మంలో నిగారింపు వస్తుంది. ఇది మొటిమలను నివారించడంతో పాటు ఎగ్జిమా, సోరియాసిస్ చికిత్స ప్రక్రియల్లో కొంతమేర సహాయపడుతుంది.
♦ మద్యం తాగిన మర్నాడు కాకర కూర తినడం లేదా కాకర రసం తాగడం మంచిది. మద్యం దుష్ప్రభావానికి కారణమయ్యే... కాలేయంలో పోగుపడ్డ విషాలను కాకర ప్రక్షాళన చేస్తుంది.
♦ కాకరకాయలో కార్బోహైడ్రేట్లు (పిండిపదార్థాలు), క్యాలరీలు తక్కువ. అందుకే ఆరోగ్యకరంగా బరువు తగ్గాలనుకున్న వారు కాకరకాయ కూర తినడం మంచిది.
♦ కాకరకాయ రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి, హానికారక వైరస్‌లు, బ్యాక్టీరియాలతో పోరాడుతుంది.
♦ కాకరలోని యాంటీఆక్సిడెంట్లు చాలా శక్తిమంతమైనవి. అనేక రకాల క్యాన్సర్లను ముఖ్యంగా రొమ్ము, సర్వైకల్ క్యాన్సర్లను నివారిస్తాయి.
♦ కాకరలో విటమిన్–ఏ పుష్కలంగా ఉండటం వల్ల కంటికి మేలు చేయడంతో పాటు క్యాటరాక్ట్‌ను సమర్థంగా నివారిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే కాకర దేహాన్ని కండిషన్‌లో ఉంచుతుంది.
Comments
Please login to add a commentAdd a comment