
కడుపు కదిలిపోతే... క్యారట్‌తో..!
గృహవైద్యం
జీర్ణాశయంలో ఒడుదొడుకులు మొదలైతే తక్షణ ఉపశమనానికి క్యారట్- పుదీనా రసం తీసుకోవాలి. నాలుగు కప్పుల నీటిలో నాలుగు క్యారట్ ముక్కలు, నాలుగైదు తాజా పుదీనా ఆకులు (లేకపోతే ఎండిన పుదీనా ఆకుల పొడి ఒక టీ స్పూను) వేసి సన్నమంట మీద ఓ 15 నిమిషాల పాటు మరిగించాలి (క్యారట్ మెత్తబడే వరకు). వేడి తగ్గిన తర్వాత అన్నింటినీ కలిపి మిక్సీలో వేసి చెంచాడు అల్లం తురుము, కొద్దిగా నిమ్మరసం కలిపి తాగాలి. సాధారణంగా ఒక గ్లాసు తాగితే సరిపోతుంది. అవసరమైతే నాలుగు గంటల విరామంతో మరో గ్లాసు తాగవచ్చు.