
కూపన్లతో చౌకగా షాపింగ్..
ఏవో కొన్ని మినహా.. సాధారణంగానే బైటి షాపులతో పోలిస్తే ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్లు చౌకగా వివిధ రకాల ఉత్పత్తులను అమ్ముతుంటాయి. ఈ రేట్లపై మరికాస్త డిస్కౌంటు పొందే మార్గాల్లో కూపన్‌లు కూడా ఒక మార్గం. కూపన్‌నేషన్‌డాట్‌ఇన్, కూపన్‌దునియాడాట్‌కామ్ లాంటి వెబ్‌సైట్లు తమ సైటు ద్వారా షాపింగ్ చేసే వారికి ఇటువంటి సదుపాయం కల్పిస్తున్నాయి. ఈ వెబ్‌సైట్లలో కూపన్ కోడ్స్ ఉంటాయి. వీటిని కాపీ చేసి.. మనం కొనుగోలు చేస్తున్న వెబ్‌సైట్లోకి వెళ్లి, షాపింగ్ చేసే వస్తువు దగ్గర కూపన్ కోడ్ అని రాసి ఉన్న చోట పేస్ట్ చేయాలి. దీంతో ఆయా ఉత్పత్తులపై అదనంగా మరికాస్త డిస్కౌంటు లభిస్తుంది. అయితే, ఈ కూపన్‌లు ఏయే ఉత్పత్తులకు, ఎప్పటిదాకా వర్తిస్తాయో చూడాలి.