చిన్నారులకు పీడకలలు వస్తుంటే... | Children nightmares comming | Sakshi
Sakshi News home page

చిన్నారులకు పీడకలలు వస్తుంటే...

Published Mon, Jun 8 2015 12:04 AM | Last Updated on Sun, Sep 3 2017 3:23 AM

చిన్నారులకు పీడకలలు వస్తుంటే...

చిన్నారులకు పీడకలలు వస్తుంటే...

గుండెకు హత్తుకోండి : కల వచ్చిందని మీ చిన్నారి లేవగానే దగ్గరకు తీసుకుని గుండెకు హత్తుకోండి. మీ స్పర్శ వారిలోని గుండె దడను పోగొడుతుంది.
వినండి, అర్థం చేసుకోండి: కలల్లోంచి పిల్లలు ఉలిక్కిపడి లేచి ఏడుస్తుంటే వారిని చూసి నవ్వకండి. ఆటపట్టించకండి. కల గురించి అడగండి.
ధైర్యం చెప్పండి : నీ పక్కనే నేను ఉన్నాను. ఉంటాను. కాబట్టి భయమేం లేదు అన్న ధైర్యం ఇవ్వండి.
చీకటిని అలవాటు చెయ్యండి: చీకట్లో కబుర్లు చెప్పుకోవడం, చీకటిలో పీడకలల గురించి జోకులు వెయ్యడం వల్ల పిల్లలకు భయం అనేది కలుగదు.
మాట్లాడండి : కలల్లో భయపెట్టే దెయ్యాలు, భూతాల గురించి, మరణాల గురించి పిల్లలతో తరచు మాట్లాడుతుండండి. కల అన్నది నిజం కాదని, కాలేదని అర్థమయ్యేలా చెప్పండి.
లైటు వేసి ఉంచండి : పిల్లలకు తరచు పీడకలలు వస్తూ ఉంటే కనుక రాత్రంతా లైటు వేసి ఉంచడం మంచి ఫలితాన్ని ఇస్తుంది.
టీవీ షోలు: ముఖ్యంగా భయపెట్టే టీవీ షోలను చూడనివ్వకండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement