
కంటి నిండా నిద్ర పట్టకపోతే.. ఎంత చికాకో మనకు తెలియంది కాదు. పైగా ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు నిద్రలేమి హేతువు అవుతుంది. ఈ నేపథ్యంలో కొలంబియా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు చేసిన ఒక ప్రయోగం ఆసక్తికరమైన విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. ఈగలపై జరిగిన ఈ ప్రయోగం ద్వారా నిద్ర వల్ల శరీరానికి కలిగే ప్రయోజనం ఆక్సిడేటివ్ ఒత్తిడి తగ్గడం కావచ్చునని స్పష్టం చేసింది. తినే ఆహారం, పీల్చేగాలి... పరిసరాల్లోని వాతావరణం వంటి అనేక కారణాల వ్ల మన శరీరంలో ఫ్రీరాడికల్స్ ఎక్కువవుతాయని.. ఇవి కాస్తా వాపు/మంటకు దారితీసి చివరకు అనేక వ్యాధులకు కారణమవుతుంది.
ఈ విషయాన్ని నిర్ధారించుకునేందుకు శాస్త్రవేత్తలు అతితక్కువ సమయం మాత్రమే నిద్రపోయే ఈగలను ఎన్నుకున్నారు. వీటన్నింటిలోనూ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించిన వీరు.. మిగిలిన వాటితో పోల్చి చూడటం ద్వారా నిద్ర ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గిస్తుందన్న అంచనాకు వచ్చారు. నిద్రలేమి కారణంగా అల్జైమర్స్, పార్కిన్‌సన్స్, హంటింగ్‌టన్స్ వంటి వ్యాధులు వస్తాయని, నిద్రతక్కువైతే ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎక్కువై మరిన్ని సమస్యలకు దారితీస్తుందని తమ అధ్యయనం స్పష్టం చేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment