Oxidative stress
-
నిద్ర ప్రయోజనం ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గించడమా?
కంటి నిండా నిద్ర పట్టకపోతే.. ఎంత చికాకో మనకు తెలియంది కాదు. పైగా ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు నిద్రలేమి హేతువు అవుతుంది. ఈ నేపథ్యంలో కొలంబియా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు చేసిన ఒక ప్రయోగం ఆసక్తికరమైన విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. ఈగలపై జరిగిన ఈ ప్రయోగం ద్వారా నిద్ర వల్ల శరీరానికి కలిగే ప్రయోజనం ఆక్సిడేటివ్ ఒత్తిడి తగ్గడం కావచ్చునని స్పష్టం చేసింది. తినే ఆహారం, పీల్చేగాలి... పరిసరాల్లోని వాతావరణం వంటి అనేక కారణాల వ్ల మన శరీరంలో ఫ్రీరాడికల్స్ ఎక్కువవుతాయని.. ఇవి కాస్తా వాపు/మంటకు దారితీసి చివరకు అనేక వ్యాధులకు కారణమవుతుంది. ఈ విషయాన్ని నిర్ధారించుకునేందుకు శాస్త్రవేత్తలు అతితక్కువ సమయం మాత్రమే నిద్రపోయే ఈగలను ఎన్నుకున్నారు. వీటన్నింటిలోనూ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించిన వీరు.. మిగిలిన వాటితో పోల్చి చూడటం ద్వారా నిద్ర ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గిస్తుందన్న అంచనాకు వచ్చారు. నిద్రలేమి కారణంగా అల్జైమర్స్, పార్కిన్సన్స్, హంటింగ్టన్స్ వంటి వ్యాధులు వస్తాయని, నిద్రతక్కువైతే ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎక్కువై మరిన్ని సమస్యలకు దారితీస్తుందని తమ అధ్యయనం స్పష్టం చేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. -
సీజన్ వేడిగా... శరీరం చల్లగా...
యోగా వేసవిలో జీవక్రియలు ఎక్కువగా ఉంటాయి. ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎక్కువ. ఆక్సిజన్ లెవల్స్ పడిపోతుంటాయి. ఇలాంటప్పుడు శరీరానికి ఇంకా అలసట కలిగించే ఆసనాలు కాకుండా కావల్సినంత ఆక్సిజన్ తీసుకుంటూ నిదానంగా చేసే ఆసనాలను సాధన చేయాలి. జీవక్రియ వేగాన్ని తగ్గించే చంద్ర నమస్కారాలు, శరీరం, మనసు బాగా విశ్రాంతి పొందడానికి సహకరించే శశాంకాసనం, మకరాసనం, మార్జాలాసనం, బాలాసనం, అర్ధ అధోముఖ శ్వాసాసనం, నిరాలంబాసన... వీటితో ఎక్కువ విశ్రాంతి పొందుతాం. అలాగే ఆసనాలైన పాద హస్తాసనం, జాను శిరాసనం, ఉష్ట్రాసనం లాంటివి చేయడంతో పాటు ప్రతిరోజూ యోగనిద్ర కూడా చేయాలి. ఉష్ణక్రియ, సమశీతోష్ణక్రియ, శీతలీక్రియలుగా ప్రాణాయామాలు విభజింపబడ్డాయి. ఉష్ణక్రియ ప్రాణాయామాలు (శరీరంలో ఉష్ణాన్ని జనింపచేసేవి. ఇవి చలికాలానికి మంచివి). సమశీతోష్ణక్రియ ప్రాణాయామాలు సీజన్స్ మారే సమయంలో మంచివి. శరీరాన్ని చల్లబరచడానికి చంద్రభేది, అనులోమ విలోమ, శీతలీ, శీతకారి, ఉజ్జయి ప్రాణాయామాలు ఉపకరిస్తాయి. ఈ కోవకు చెందిన ప్రాణాయమాలు ఈ వారం తెలుసుకుందాం... 1. చంద్రబేధి ప్రాణాయామం అర్ధ పద్మాసనం లేదా సుఖాసనంలో కూర్చోవాలి. వెన్నెముక, మెడ నిటారుగా ఉంచి ఎడమచెయ్యిని ధ్యానముద్ర (చూపుడు వేలు చివరభాగం బొటవేలు చివరభాగానికి తాకించి) లేదా చిన్ముద్ర (చూపుడు వేలు చివరభాగం బొటనవేలు మధ్యభాగానికి తాకించి)లో ఉంచి, కుడిచేతిని నాసికా ముద్ర లేదా నాసాగ్రముద్రలో లేదా మధ్యలో మూడు వేళ్లు మడిచి బొటన వేలు చిటికెన వేలితో నాసిక రంధ్రాలను మూస్తూ చేయాలి. చేసే విధానం: కుడి ముక్కు రంధ్రాన్ని మూసి ఎడమ ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటూ, శ్వాస తీసుకున్న తరువాత ఎడమ ముక్కు రంధ్రాన్ని మూసి ఉంచి కుడి ముక్కు రంధ్రాన్ని తెరిచి కుడి ముక్కు ద్వారా శ్వాసను బయటకు వదలాలి. మళ్లీ ఎడమ ముక్కు ద్వారా శ్వాస తీసుకుని కుడి ముక్కు ద్వారా శ్వాసను బయటకు పంపించాలి. ఈ విధంగా 5 లేదా 10 సార్లు రిపీట్ చేయాలి. గమనిక: రైట్ హ్యాండర్స్ కుడి చేత్తో, లెఫ్ట్ హ్యాండర్స్ ఎడమచేత్తో చేయవచ్చు. కుడిచేత్తో చేసేటట్లయితే కుడిముక్కు రంధ్రాన్ని మూయడానికి తెరవడానికి బొటనవేలును ఉపయోగిస్తారు. ఎడమచేతి వాటం ఉన్నవాళ్ళు చిటికెన వేలుతో కుడి ముక్కు రంధ్రాన్ని తెరవడం, మూయడం చేస్తారు. ఉపయోగాలు: ఎడమ ముక్కు నుంyì శ్వాస తీసుకుంటాం కనుక మెదడులోని కుడి గోళార్ధానికి ఆక్సిజన్ ఎక్కువగా పంపబడి మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. స్ట్రెస్, టెన్షన్స్, హై బీపి, ఎమోషనల్ ఇన్‌బ్యాలెన్స్ వంటి సమస్యలకు చాలా మంచిది. క్రియేటివ్ థింకింగ్, ప్యారల్లెట్ ప్రాసెసింగ్‌కి ఉపయోగించే కుడి మెదడు పనితీరు మెరుగవడానికి ఉపయోగపడుతుంది. 2. విభాగ ప్రాణాయామం ఊపిరితిత్తులు మూడు భాగాలుగా (అప్పర్, మిడిల్, లోయర్), ఎడమ ఊపిరితిత్తులలో రెండు భాగాలుగా (అప్పర్, లోయర్) విభజింపబడి ఉంటాయి. ఊపిరితిత్తులలో అన్ని భాగాలకు ఆక్సిజన్‌ను అందించడానికి చేసే ప్రాణాయామాలే విభాగ ప్రాణాయామాలు. పక్కన చూపించిన విధంగా ఆసనంలో కూర్చుని మోచేతుల పొజిషన్‌ను పైకి పక్కలకు కిందకు చూపిస్తూ, ప్రతి పొజిషన్లో 5 లేదా 10 సార్లు రిపీట్ చేస్తూ చేయాలి. విభాగ ప్రాణాయామాలు చేసే పలు విధానాలలో పైన చెప్పబడినవి ఒక విధానం. తీసుకునే ఆహారంలో ముఖ్యంగా గమనించదగినది – క్షారతత్వం గల పదార్థాలను ఆమ్లతత్వం గల పదార్థాలను 60:40 నిష్ఫత్తిలో తీసుకోవడం ముఖ్యం. క్షారతత్వం కలవి: పచ్చికూరలు, సగం ఉడికిన కూరగాయలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ మొదలైనవి. ఆమ్లతత్వం కలవి: వెన్న తీయని పాలు, వెన్న, వైట్ బ్రెడ్, మాంసం, గుడ్లు, చీజ్ శరీరం డీ–హైడ్రేట్ కాకుండా తగినన్ని నీళ్లు, జ్యూసులు తాగడం ఎంతైనా అవసరం. ప్రతి కిలోగ్రాము శరీర బరువుకు 60 ఎం.ఎల్ నీళ్లు లేదా ద్రవపదార్థాలు తీసుకోవాలి. అధిక అమ్లతత్వం గల ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలోని వివిధ వ్యవస్థలలో పిహెచ్ ఇన్‌బ్యాలెన్స్‌కి దారి తీస్తుంది. పిహెచ్ బాలెన్స్ కాకపోతే అది దీర్ఘకాలంలో యూరిక్ యాసిడ్‌గా మారి కిడ్నీ స్టోన్స్, క్యాన్సర్, కాలేయం, గుండె సమస్యలకు దారి తీస్తుంది. సమన్వయం: సత్యబాబు -
‘ప్రో యంగ్’ సెల్యులార్ న్యూట్రిషన్
ఆరోగ్యంగా జీవించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. చెడిపోయిన ఆరోగ్యాన్ని తిరిగి పొందాలని తపిస్తారు. వ్యాధి నయం చేయడం కన్నా నివారించడం మంచిదని మనందరకీ తెలుసు. కానీ అది ఎలా సాధ్యపడుతుందన్న విషయం మాత్రం చాలా మందికి తెలియదు. శాస్త్రీయ పరిశోధనల ఆధారంగా నిర్ణయించే ఆక్సిజన్ ఫ్రీ రాడికల్స్ ద్వారా ఏర్పడే విధ్వంసమే ‘ఆక్సిడేటివ్ స్ట్రెస్’. దాదాపు అన్ని రకాల లైఫ్ స్టైల్ క్రానిక్ డీ జనరేటివ్ డిసీజెస్ కు మూల కారణం ఇదే. హై బీపీ, హార్ట్ డిసీజెస్, డయాబెటిస్, క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులకు ఫ్రీ రాడికల్స్ విధ్వంసమే హేతువు. అత్యుత్తమమైన పోషకాలు (హై క్వాలిటీ యాంటీ ఆక్సిడెంట్స్) నిండిన ఆహారం, సరైన మోతాదులో న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ తీసుకోవడం ద్వారా ఈ విధ్వంసాన్ని సమర్థంగా ఎదుర్కోవచ్చు. యాంటీఆక్సిడెంట్స్ కన్నా ఫ్రీ రాడికల్స్ సంఖ్య పెరిగినప్పుడు ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఏర్పడుతుంది. ఈ ప్రక్రియ అలాగే కొనసాగితే అనేక రకాల లైఫ్‌స్టైల్ క్రానిక్ డీ జనరేటివ్ డిసీజెస్‌కు దారితీస్తుంది. మన శరీరంలో కణజాల స్థాయిలో జరిగే యుద్ధంలో దెబ్బతిన్న, వ్యాధిగ్రస్తమైన కణజాలాన్ని బాగు చేయలేక సహజసిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్ రక్షణ వ్యవస్థ ఓడిపోతుంది. శరీరం కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్‌ను మాత్రమే తయారు చేస్తుంది. మనలోని రక్షణ వ్యవస్థను బలోపేతం చేసి పోరాడి గెలవడానికి అవి సరిపోవడం లేదు. ఎందుకంటే తినే ఆహారం ముఖ్యంగా పండ్లు, కూరగాయలలో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా తక్కువ స్థాయిలో ఉంటున్నాయి. ఫలితంగా సంభవించే ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను నిర్మూలించాలంటే జీవన శైలిలో అత్యంత కీలక మార్పులు తీసుకురావడం కన్నా మరో మార్గం లేదు. క్రమబద్ధమైన వ్యాయామం, సేంద్రియ ఆహారం ముఖ్యం. మనలోని సహజసిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్ రక్షణ వ్యవస్థ బలపడి దెబ్బతిన్న కణజాలాన్ని బాగుచేసుకుని ఉత్సాహకరమైన ఆరోగ్యం అందించే మార్గమే ‘కణజాల పోషణ’(సెల్యులార్ నూట్రిషన్). ఇదే నిజమైన నివారణ ఔషధం. అందుకే చక్కని ఆరోగ్యాన్ని ప్రసాదించే ప్రకృతి సిద్ధమైన, సమృద్ధికరమైన పోషక విలువలు కలిగిన న్యూట్రిషన్ సప్లిమెంట్స్‌ను మనదేశంలో అందుబాటులోకి తెచ్చింది అంతర్జాతీయ సంస్థ డీఎన్జీ గ్రూప్ ‘ప్రో యంగ్ ఇంటర్నేషనల్.’ వ్యాధి లక్షణాలు బయట పడకముందే గుర్తించి నాణ్యమైన పోషకాలను అందించడం ద్వారా వ్యాధులను నిర్మూలించడంలో తమ న్యూట్రిషన్స్ కీలక పాత్ర పోషిస్తోందని ప్రో యంగ్ ఇంటర్నేషనల్ వైస్ చైర్మన్ డాక్టర్ దశరథరామిరెడ్డి నలబోలు తెలిపారు. వందశాతం ఆరోగ్యానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్స్‌ను అందించే సహజసిద్ధమైన పోషకాహారానికి పెట్టింది పేరు ప్రో యంగ్ ఇంటర్నేషనల్. శరీరానికి ఉన్నత ప్రమాణాలు గల పోషకాన్ని అందిస్తూ తద్వారా యాంటీ ఆక్సిడెంట్ రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడంలో వీరి ఉత్పత్తులు సాటిలేనివి. ప్రపంచ వ్యాప్తంగా లభ్యమయ్యే ఔషధ వృక్షాల నుంచి ప్రో యంగ్ ఉత్పత్తులు తయారవుతాయి. ది కింగ్ ఆఫ్ హెర్బ్స్ గా భావించే ‘గానోడెర్మా లూసిడమ్’ వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఎంత పెద్ద అనారోగ్యాన్నైనా తిప్పికొట్టే శక్తిని శరీరానికి ఇస్తుంది. గింకో బిలోబా రక్తప్రసరణ వ్యవస్థను మెరుగుపరచి గుండె జబ్బుల నివారణలో తోడ్పడుతుంది. ఇంకా పనాక్స్ జిన్సెంగ్, నోనీ వంటి ఆరోగ్యభాగ్యం అందించే పోషకాహార ఉత్పత్తులతోపాటు పూర్తిగా పండ్లతో తయారు చేసిన, సౌందర్య సాధనాలు ప్రో యంగ్‌లో లభిస్తాయి. మరెందుకు ఆలస్యం ప్రో యంగ్ ఉత్పత్తులతో మీరు కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించండి.