‘ప్రో యంగ్’ సెల్యులార్ న్యూట్రిషన్ | It would be better to prevent than to cure the disease | Sakshi
Sakshi News home page

‘ప్రో యంగ్’ సెల్యులార్ న్యూట్రిషన్

Published Fri, Aug 29 2014 12:28 AM | Last Updated on Sat, Sep 2 2017 12:35 PM

‘ప్రో యంగ్’ సెల్యులార్ న్యూట్రిషన్

‘ప్రో యంగ్’ సెల్యులార్ న్యూట్రిషన్

ఆరోగ్యంగా జీవించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. చెడిపోయిన ఆరోగ్యాన్ని తిరిగి పొందాలని తపిస్తారు. వ్యాధి నయం చేయడం కన్నా నివారించడం మంచిదని మనందరకీ తెలుసు. కానీ అది ఎలా సాధ్యపడుతుందన్న విషయం మాత్రం చాలా మందికి తెలియదు. శాస్త్రీయ పరిశోధనల ఆధారంగా నిర్ణయించే ఆక్సిజన్ ఫ్రీ రాడికల్స్ ద్వారా ఏర్పడే విధ్వంసమే ‘ఆక్సిడేటివ్ స్ట్రెస్’. దాదాపు అన్ని రకాల లైఫ్ స్టైల్ క్రానిక్ డీ జనరేటివ్ డిసీజెస్ కు మూల కారణం ఇదే. హై బీపీ, హార్ట్ డిసీజెస్, డయాబెటిస్, క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులకు ఫ్రీ రాడికల్స్ విధ్వంసమే హేతువు.
 
అత్యుత్తమమైన పోషకాలు (హై క్వాలిటీ యాంటీ ఆక్సిడెంట్స్) నిండిన ఆహారం, సరైన మోతాదులో న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ తీసుకోవడం ద్వారా ఈ విధ్వంసాన్ని సమర్థంగా ఎదుర్కోవచ్చు.
 
యాంటీఆక్సిడెంట్స్ కన్నా ఫ్రీ రాడికల్స్ సంఖ్య పెరిగినప్పుడు ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఏర్పడుతుంది. ఈ ప్రక్రియ అలాగే కొనసాగితే అనేక రకాల లైఫ్‌స్టైల్ క్రానిక్ డీ జనరేటివ్ డిసీజెస్‌కు దారితీస్తుంది. మన శరీరంలో కణజాల స్థాయిలో జరిగే యుద్ధంలో దెబ్బతిన్న, వ్యాధిగ్రస్తమైన కణజాలాన్ని బాగు చేయలేక సహజసిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్ రక్షణ వ్యవస్థ ఓడిపోతుంది. శరీరం కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్‌ను మాత్రమే తయారు చేస్తుంది. మనలోని రక్షణ వ్యవస్థను బలోపేతం చేసి పోరాడి గెలవడానికి అవి సరిపోవడం లేదు.
 
ఎందుకంటే తినే ఆహారం ముఖ్యంగా పండ్లు, కూరగాయలలో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా తక్కువ స్థాయిలో ఉంటున్నాయి. ఫలితంగా సంభవించే ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను నిర్మూలించాలంటే జీవన శైలిలో అత్యంత కీలక మార్పులు తీసుకురావడం కన్నా మరో మార్గం లేదు. క్రమబద్ధమైన వ్యాయామం, సేంద్రియ ఆహారం ముఖ్యం. మనలోని సహజసిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్ రక్షణ వ్యవస్థ బలపడి దెబ్బతిన్న కణజాలాన్ని బాగుచేసుకుని ఉత్సాహకరమైన ఆరోగ్యం అందించే మార్గమే ‘కణజాల పోషణ’(సెల్యులార్ నూట్రిషన్).  ఇదే నిజమైన నివారణ ఔషధం. అందుకే చక్కని ఆరోగ్యాన్ని ప్రసాదించే ప్రకృతి సిద్ధమైన, సమృద్ధికరమైన పోషక విలువలు కలిగిన న్యూట్రిషన్ సప్లిమెంట్స్‌ను మనదేశంలో అందుబాటులోకి తెచ్చింది అంతర్జాతీయ సంస్థ డీఎన్‌జీ గ్రూప్
 
‘ప్రో యంగ్ ఇంటర్నేషనల్.’  వ్యాధి లక్షణాలు బయట పడకముందే గుర్తించి నాణ్యమైన పోషకాలను అందించడం ద్వారా వ్యాధులను నిర్మూలించడంలో తమ న్యూట్రిషన్స్ కీలక పాత్ర పోషిస్తోందని ప్రో యంగ్ ఇంటర్నేషనల్ వైస్ చైర్మన్ డాక్టర్ దశరథరామిరెడ్డి నలబోలు తెలిపారు.
 
వందశాతం ఆరోగ్యానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్స్‌ను అందించే సహజసిద్ధమైన పోషకాహారానికి పెట్టింది పేరు ప్రో యంగ్ ఇంటర్నేషనల్. శరీరానికి ఉన్నత ప్రమాణాలు గల పోషకాన్ని అందిస్తూ తద్వారా యాంటీ ఆక్సిడెంట్ రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడంలో వీరి ఉత్పత్తులు సాటిలేనివి.
 
ప్రపంచ వ్యాప్తంగా లభ్యమయ్యే ఔషధ వృక్షాల నుంచి ప్రో యంగ్ ఉత్పత్తులు తయారవుతాయి. ది కింగ్ ఆఫ్ హెర్బ్స్ గా భావించే ‘గానోడెర్మా లూసిడమ్’ వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఎంత పెద్ద అనారోగ్యాన్నైనా తిప్పికొట్టే శక్తిని శరీరానికి ఇస్తుంది. గింకో బిలోబా రక్తప్రసరణ వ్యవస్థను మెరుగుపరచి గుండె జబ్బుల నివారణలో తోడ్పడుతుంది.  ఇంకా పనాక్స్ జిన్సెంగ్, నోనీ వంటి ఆరోగ్యభాగ్యం అందించే పోషకాహార ఉత్పత్తులతోపాటు పూర్తిగా పండ్లతో తయారు చేసిన, సౌందర్య సాధనాలు ప్రో యంగ్‌లో లభిస్తాయి. మరెందుకు ఆలస్యం ప్రో యంగ్ ఉత్పత్తులతో మీరు కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement