నా వయసు 35 ఏళ్లు. గతంలో బాగా ఎక్సర్‌సైజ్ చేసేవాణ్ణి. ఆ తర్వాత కూడా , కుదరనప్పుడు ఆపడం వంటివి చేసినా కొంతకొంత గ్యాప్స్ తర్వాత ఎక్సర్‌సైజు చేయడం మొదలుపెట్టేవాణ్ణి. అయితే ఇటీవల నాకు బీపీ ఉన్నట్లుగా డాక్టర్లు నిర్ధారణ చేశారు. ఇప్పుడు నేను ఎక్సర్‌సైజ్‌లు చేయవచ్చా?
- ఆనంద్, హైదరాబాద్
మీరు మీ హైపర్‌టెన్షన్‌కు మందులు వాడుతున్నారో లేదో మీ లేఖలో రాయలేదు. హైబీపీతో బాధపడేవాళ్లు కూడా ఎక్సర్‌సైజ్ చేయవచ్చు. కాకపోతే కొన్ని నియమాలు పాటించాలి. మిగతావారిలా హైబీపీ ఉన్నవాళ్లు పరగడునే ఎక్సర్‌సైజ్ చేయకూడదు. ఏదైనా తిని, ఆ తర్వాత బీపీ మందులు వేసుకున్న తర్వాతే ఎక్సర్‌సైజ్‌లు మొదలుపెట్టాలి. అప్పుడే బీపీ విలువలు ఎక్కువ, తక్కువలు కాకుండా ఉంటాయి. ఇక హైబీపీ ఉన్నవారు ఎక్సర్‌సైజ్ చేసేప్పుడు తప్పనిసరిగా వార్మ్‌అప్ వ్యాయామాలు చేశాకే అసలు వ్యాయామాలు చేయాలి. ఆ తర్వాత క్రమంగా కూల్‌డౌన్ ఎక్సర్‌సైజ్‌లూ చేయాలి. కొంతగ్యాప్ తర్వాత మొదలుపెట్టేవారైతే నేరుగా ఒకేసారి ఎక్సర్‌సైజ్‌లు మొదలుపెట్టకూడదు. మొదటివారం 15 నిమిషాలు, రెండోవారం 30 నిమిషాలు, ఆ తర్వాతి వారం 45 నిమిషాలు ఓ మోస్తరు వేగంతో నడక వంటి వ్యాయామాలు చేయాలి. రోజుకు 45 నిమిషాల పాటు ఓ మోస్తరు వేగంతో నడవడం అనేది హైబీపీ ఉన్నవారికి ఉత్తమమైన వ్యాయామ ప్రక్రియ. ఇక బీపీ ఉన్నవారు ఉదయం వేళలలో వ్యాయామం చేయడం మంచిది.
డాక్టర్ సుధీంద్ర ఊటూరి,
కన్సల్టెంట్ లైఫ్‌స్టైల్ అండ్ రీహ్యాబిలిటీషన్,
కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్
హై బీపీ కౌన్సెలింగ్
Published Tue, May 19 2015 11:36 PM | Last Updated on Sun, Sep 3 2017 2:19 AM
Advertisement
Advertisement