ఇంటిప్స్
మిరపకాయలు కోసే ముందు చేతులకు కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ రాసుకుంటే మంట పుట్టదు. శెనగపిండి నిల్వ అయిపోతే పారేయాల్సిన అవసరం లేదు. దానిలో కాసింత నిమ్మరసం కలిపి పాత్రలు తోమితే తళతళలాడతాయి.
చీజ్, పన్నీరు లాంటివి నిల్వ చేసే డబ్బాలో చిన్న బెల్లం ముక్క ఉంచితే ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. సగం కోసిన ఉల్లిపాయ పాడవకుండా ఉండాలంటే... వెన్న రాసి ఉంచాలి.