పూర్వం ఇశ్రాయేలు దేశంలో కరువు వచ్చింది. దాంతో అక్కడ నివసించే ఎలీమెలెకు అనే అతడు తన భార్య నయోమి, ఇద్దరు కుమారులతో కలిసి పొరుగు దేశమైన మోయాబు దేశానికి వలస వెళ్లాడు. వారు ఆ దేశంలో ఉన్న కొంత కాలానికి నయోమి భర్త చనిపోయాడు. తర్వాత తన ఇద్దరు కుమారులైన మహ్లోను, కిల్యోనుకు మోయాబు దేశపు యువతులైన ఓర్పా, రూతులతో వివాహం చేసిందామె. కొంతకాలానికి నయోమి ఇద్దరు కుమారులు మరణించారు.
ఇలా అనేక బాధలు అనుభవిస్తున్న నయోమికి తన దేశమైన యూదా బెత్లెహేములో దేవుడు కరువు లేకుండా ఆహారాన్ని ప్రసాదించాడని తెలుసుకొని, ఇరువురి కోడళ్లను పిలిచి – మీరు మీ పుట్టింటికి వెళ్లి మరలా వివాహం చేసుకుని బిడ్డలతో సుఖసంతోషాలతో జీవించండని చెప్పింది.
అందుకు తన పెద్ద కోడలు ఓర్పా దుఃఖంతో తన అత్తను ముద్దుపెట్టుకొని తిరిగి తన స్వజనుల వద్దకు వెళ్లిపోయింది. తన రెండవ కోడలు రూతు మాత్రం తన అత్తను హత్తుకొని ‘‘నా వెంబడి రావద్దని, నన్ను విడిచి పెట్టుమనీ నన్ను బతిమాలుకొనవద్దు. నీవు ళ్లే చోటికే నేనూ వస్తాను, నీవు నివసించు చోటే నేనూ ఉంటాను. నీ జనమే నా జనం. నీ దేవుడే నా దేవుడు... మరణం తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన యెడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయును గాక’’ (రూతు 1:16–17) అని తన దేశాన్ని, స్వజనులను విడిచి తన అత్తతో కలిసి వెళ్లింది.నయోమి వంటి మంచి మనస్తత్వం గల అత్తలు ఎందరుంటారు? సహచరులుగా వుంటూ మాట తప్పేవారు ఉన్న రోజుల్లో ‘సహచరి’ అంటే ఇలాంటి వారని నిరూపించిన రూతు వంటి ఉత్తమ స్త్రీలు ఎందరుంటారు? రూతు అంత మంచి మనస్తత్వం గలది కాబట్టే ఏసు తన పుట్టుకకు ఆమె వంశాన్నే ఎంచుకున్నారు.– బి.బి.చంద్రపాల్ కోట
Comments
Please login to add a commentAdd a comment