ఒక్క తుమ్ములో లక్ష క్రిములు!
సాధారణంగా పెద్దవాళ్లకు ఏడాదికి రెండుసార్లు జలుబు చేస్తుంది. పిల్లలకు కనీసం 6 నుంచి 10 సార్లు జలుబు చేస్తుంది.జలుబుకు 200 వైరస్‌లు కారణం అవుతాయి! అన్ని వైరస్‌లకు కలిపి ఒకే వ్యాక్సిన్ కనిపెట్టాలని శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్లుగా చేస్తున్న ప్రయోగాలు ఫలించడం లేదు.ఒక్కో జలుబు వైరస్‌కు రోజుకు కోటీ అరవై లక్షల సంతానాన్ని ఉత్పత్తి చేసే శక్తి ఉంటుంది. చిన్న తుమ్ముకే పక్కవాళ్లకు జలుబు సోకడం ఇందువల్లనే!
► మనిషి శ్వాసకు సెకనుకు 4.5 అడుగుల వేగం ఉంటుంది. మనిషి తుమ్ము నుండి వెలువడే తుంపర్లు గంటకు 100 మైళ్ల వేగంతో ప్రయాణిస్తాయి.
►ఒక్క తుమ్ము గాలిలోకి లక్ష క్రిములను వెదజల్లుతుంది. అందుకే తుమ్ముతున్న మనిషికి కనీసం ఆరడుగుల దూరంలో ఉండాలి. లేదా ముఖానికి మాస్క్ పెట్టుకోవాలి.
►విటమిన్ సి.. జలుబును తగ్గిస్తుందని అంటారు కానీ అది నిజం కాదు. విటమిన్ సి జబుబు తీవ్రతను కొద్దిగా మాత్రమే తగ్గించగలదు. అదీ రెండు మూడు రోజుల తర్వాతనే. దేవుడా!
సీజన్
బ్రిటన్ మహారాణి క్వీన్ ఎలిజబెత్ 2 ఈ ఏడాది నూతన సంవత్సర వేడుకలు హాజరు కాలేదు! రాణిగారు తీవ్రమైన జలుబుతో బాధపడుతుండడమే అందుకు కారణం అని బకింగ్‌హామ్ ప్యాలెస్ ఒక ప్రకటన విడుదల చేసింది.