
పరీక్షలు రాసే పిల్లల కోసం, పరీక్షలు రాయించే పేరెంట్స్ కోసం, పరీక్షలు పెట్టే టీచర్ల కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఓ పుస్తకం రాశారు. ఆ పుస్తకం పేరు ‘ఎగ్జామ్స్ వారియర్స్’. పరీక్షల యోధులు అని! మొన్న శనివార మే విడుదలైంది. పరీక్షల ఒత్తిడిని తట్టుకోవడం ఎలా? అని ఆ బుక్కులో 25 సూత్రాలు ఇచ్చారు మోదీజీ. సూత్రాలతో పాటు గుప్పెడు ఆసనాలు కూడా! గత ఏడాది జనవరిలో మోదీజీ ‘మన్ కీ బాత్’ రేడియో ప్రసంగంలో పరీక్షల ఒత్తిడి గురించి మాట్లాడారు.
జూలై కల్లా పరీక్షల ఫలితాలు వచ్చాయి. అప్పుడు పాస్ అయినవాళ్లు చాలామంది మోదీకి పర్సనల్‌గా ఉత్తరాలు రాశారట.. ‘మీ వల్లే.. మీ వల్లే’ అని. ఆ ఇన్‌స్పిరేషన్‌తో మోదీజీ ఇప్పుడు ఏకంగా పుస్తకమే తెచ్చారు. ‘పరీక్షలు పండుగల్లాంటివి.. కాబట్టి పండుగ చేస్కోండి’. ‘మీ నావకు మీరే లంగరు. కాబట్టి మీ చేతి బలం చూసుకోండి’. ‘చీట్ చెయ్యడం అంటే చీప్ అవ్వడమే’.. ఇలా ఉంది పుస్తకంలో మో(డీ)టివేషన్. పెంగ్విన్ ప్రచురణకర్తలు ఈ బుక్ వేశారు. ధర 98 రూపాయలు. మోదీజీని మెల్లిగా మోటివేట్ చేసి.. నోట్ల రద్దు స్ట్రెస్ మీద, జీఎస్టీ స్ట్రెస్ మీద కూడా బుక్కులు వేయిస్తే.. ఇండియా మొత్తం స్ట్రెస్ ఫ్రీ అవుతుంది కదా!
Comments
Please login to add a commentAdd a comment