కొట్టొచ్చే కట్టు
అదేంటో మనం ఎంత ఖర్చుపెట్టి కొనుక్కున్నా, ఎన్ని ప్రయత్నాలు చేసినామన చీరలు చీరల్లాగే ఉంటాయి. కొట్టొచ్చేలా చీరకట్టు ఉండాలంటే కొంచెం బోల్డుగా, ఇంకొంచెం బ్యూటిఫుల్‌గా ‘సత్యపాల్’లా మనమూ ప్లాన్ చేసుకోవచ్చు.
బంగారు జరీతో రూపుకట్టిన ఫ్లోర్ లెంగ్త్ అనార్కలీ సూట్ ఇది. లేత, ముదురు ఎరుపుల కాంబినేషన్, ఎంబ్రాయిడరీ ఈ డ్రెస్‌ను అందంగా రూపుకట్టాయి.
లేత పింక్ గులాబీ పువ్వు రంగు ఈ చీర షిఫాన్, సిల్క్, జార్జెట్ లతో రూపొందించినది. సంప్రదాయంగా కనిపిస్తూనే ఆధునికం అనిపించే కట్స్‌తో ఈ చీర సమకాలీనతకు అద్దం పడుతోంది. సత్యపాల్ బ్రైడల్ శారీ కలెక్షన్‌లో ఇదీ ఒక మోడల్ చీర.
ఫ్యాబ్రిక్‌తో మ్యాజిక్...
మన దేశ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లలో సత్యపాల్ ఒకరు. దాదాపు మూడు దశాబ్దాలుగా ఈ సృజనాత్మక రంగంలో ఉన్నారు సత్యపాల్. పాల్ కేవలం డ్రెస్ డిజైనర్ మాత్రమే కాదు హ్యాండ్ బ్యాగ్స్, క్లచెస్, పురుషుల యాక్ససరీస్ కూడా డిజైన్ చేస్తారు. ముఖ్యంగా భారతీయ చీరలు అనగానే సత్యపాల్ క లెక్షన్ కళ్లముందు నిలుస్తుంది. అంతగా సత్యపాల్ డిజైన్స్ ప్రసిద్ధి పొందాయి. చీరను ఆధునికంగా చూపించడంలో పాల్‌ది ‘అచ్చు’వేసిన చెయ్యి. జార్జెట్ ఫ్యాబ్రిక్స్‌తో పాల్ చేసే మ్యాజిక్ అంతా ఇంతా కాదు. రంగల కలబోత, ప్రింట్లు, ఎంబ్రాయిడరీ డిజైన్స్ చూపు తిప్పుకోనివ్వవు. అలాగే సల్వార్ కమీజ్, లెహంగా ఛోలీ, లాంగ్ అనార్కలీ డ్రెస్‌ల సృజనలో ఎంతో ప్రత్యేకత కనిపిస్తుంది. జపాన్, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, అమెరికాలలో పాల్ డిజైన్స్‌కు మంచి మార్కెట్ ఉంది. ఈ డిజైన్స్ చూసి మన డ్రెస్ సెలక్షన్‌లో సరైన ఎంపిక చేసుకోవచ్చు.
నలుపు తెలుపు కాంబినేషన్‌తో డిజైన్ ఈ చీర అందం మల్టీకలర్‌లో ఉన్న ప్రింట్లలోనే ఉంది. ఆధునికంగా కనిపించడానికి ఉపయోగించిన లాంగ్ స్లీవ్స్ జాకెట్టు అదనపు హంగుగా అమరింది.
బ్రైడల్ వేర్‌లో భాగంగా సత్యపాల్ డిజైన్ చేసిన లెహంగా ఛోలీలు అత్యంత ఆకర్షణీయంగా కనిపాస్తాయి. అందుకు కారణం రంగుల ఎంపికనే.
పసుపు, పాల మీగడలాంటి రంగుల కలబోతతో ఈ జార్జెట్ చీరను సింగారించారు. మెరుపుల అంచు, దాని కింద భాగంలో బంగారు వెండి జరీ గీతలు ఈ చీరను మరింత సుందరంగా మార్చాయి. దీనికి మ్యాచింగ్‌గా సిల్వర్ గ్లిటర్డ్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ ఆధునికంగా మార్చివేసింది.