బరువు తగ్గేందుకు కొత్త ఐడియా.. | New Idea for Weight Loss | Sakshi
Sakshi News home page

బరువు తగ్గేందుకు కొత్త ఐడియా..

Feb 9 2018 11:59 PM | Updated on Apr 3 2019 5:45 PM

New Idea for Weight Loss - Sakshi

శరీరం బరువు

శరీరం బరువు తగ్గే విషయంలో ఒక ఎంజైమ్‌ కీలకపాత్ర పోషిస్తున్నట్లు యూనివర్శిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ఎంజైమ్‌ను నియంత్రించడం ద్వారా ఊబకాయులు సులువుగా బరువు తగ్గేలా చేయవచ్చునని శాస్త్రవేత్తల అంచనా. టీబీకే1 అని పిలిచే ఈ ఎంజైమ్‌ శరీరంలో కొవ్వును వేగంగా కరిగించేందుకు ఉపయోగపడే ఏఎంపీకే అనే ఇంకో ఎంజైమ్‌ను నియంత్రిస్తున్నట్లు తాము తెలుసుకున్నామని అంటున్నారు ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త సాలిటెల్‌. ఏఎంపీకే ఎంజైమ్‌ పనిచేస్తున్నప్పుడు కణాలన్నీ శక్తి కోసం కొవ్వులను వాడుకుంటాయని.. టీబీకే1 ఎంజైమ్‌ విడుదలైతే మాత్రం ఈ ప్రక్రియ నిలిచిపోయి.. కణాలు కొవ్వును నిల్వ చేసుకోవడం మొదలుపెడతాయని సాలిటెల్‌ వివరించారు.

ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఒళ్లు తగ్గించుకోవాలని మనం ఉపవాసం చేస్తే.. ఏఎంపీకే ఎంజైమ్‌ చైతన్యవంతమవుతుంది. సరే.. కొవ్వు కరుగుతుందనుకునేంతలోపే ఈ ప్రక్రియ కాస్తా టీబీకే1 ఎంజైమ్‌ రంగంలోకి దిగుతుందని సాలిటెల్‌ వివరించారు. బరువు తగ్గేందుకు చేసే ఉపవాసాలు కొన్నిసార్లు ఫలితమివ్వకపోయేందుకు ఇదే కారణమని అంచనా. ఈ నేపథ్యంలో టీబీకే1 ఎంజైమ్‌ ఉత్పత్తిని నియంత్రించడం ద్వారా ఇంకో ఎంజైమ్‌ తన పని తాను చేసుకునేలా చేయవచ్చునని.. కొవ్వులు వేగంగా కరిగిపోతే ఒళ్లు సులువుగా తగ్గుతుందని సాలిటెల్‌ వివరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement