మదర్‌కు నోబెల్ శాంతి బహుమతి
ఆ నేడు 1979 అక్టోబర్ 17
నార్వేలో గల నోబెల్ కమిటీ మదర్ థెరిస్సాకు శాంతి బహుమతిని ప్రకటించింది. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈ బహుమతిని జాతి, కుల, మత, లింగ, వర్ణ, వర్గ వివక్షలు లేకుండా అవసరమైన వారికి ఆపన్న హస్తం అందిస్తూ, ప్రజలందరి మధ్యా, శాంతి, సుహృద్భావనలకు బాటలు వేస్తూ మదర్ థెరిస్సా అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఆమెను ఈ బహుమతికి ఎంపిక చేసినట్లు నోబెల్ కమిటీ ప్రకటించింది.
సమాజంలో అట్టడుగున అణగారిన బలహీన వర్గాల వారికి, నిర్భాగ్యులకు నిరుపమానమైన సేవలు అందిస్తూ, అందరినీ అమ్మలా ఆదరిస్తూ విశ్వశాంతికి తోడ్పడుతున్న ఈ విశ్వమాతను ఈ పురస్కారానికి ఎంపిక చేయడం తమ అదృష్టంగా భావిస్తున్నట్లు కమిటీ ప్రకటించింది.