
అది జపాన్‌లోని ఒక పల్లెటూరు. అక్కడ ఒకాయనకు కళ్లు కనబడేవి కావు. ఒక రోజు ఆయన ఒక పని మీద ఒక పెద్దమనిషిని కలవడానికి వెళ్లాడు. అన్నీ తనకు అలవాటైన తోవలే. మాట్లాడుతూ ఉండగానే చీకటి పడింది. ఇక బయలుదేరడానికి సిద్ధమయ్యాడు. అయితే, ఈయనను ఒంటరిగా తిరిగి ఇంటికి పంపడం పెద్దమనిషికి ఇష్టం లేదు. నాకేం ఫరవాలేదన్నాడు అంధుడు.
ఆ కాలంలో జపాన్‌లో వెదురు, కాగితంతో చేసిన లాంతరు వాడేవారు. లోపల క్యాండిల్ ఉండేది. అట్లాంటి లాంతరు ఒకటి వెలిగించి ఇచ్చి, ఇక బయలుదేరమన్నాడు పెద్దమనిషి.‘నాకు ఎటూ కనబడదుకదా! నా చేతిలో లాంతరు ఉంటేనేం, లేకపోతేనేం’ అన్నాడు అంధుడు.‘నీకు కనబడదు సరే, దారిలో ఎవరెవరో వస్తుంటారు. కనీసం నీ చేతిలో లాంతరు చూస్తేనైనా వాళ్లు పక్కనుంచి వెళ్లిపోతారు కదా?’ అన్నాడు పెద్దమనిషి.
‘సరే’నని లాంతరు తీసుకుని, నమస్కారాలు చెప్పి, వీధిలో నడుచుకుంటూ పోతున్నాడు కళ్లు లేని మనిషి. అలా దారిలో కాసేపు ముందుకు సాగాక, ఒక మనిషి నేరుగా వచ్చి ఈయనకు తగిలాడు. ‘అయ్యా, ఎటు నడుస్తున్నావు? కనీసం నా చేతిలోవున్న లాంతరైనా కనబడట్లేదా?’ అన్నాడు అంధుడు. ‘లాంతరా? అదెప్పుడో ఆరిపోయింది’ అంటూ చెప్పి ముందుకు సాగాడు ఆగంతకుడు.
Comments
Please login to add a commentAdd a comment