
అమరిక : తారలు తలదించి చూడాలి!
ఇంటింటా దీపపు కాంతులతో ధగధగాయమానంగా శోభిల్లాలని కోరుకునే పండుగ దీపావళి. ఇందుకోసం ప్రమిదలను తెచ్చి ఇంటిని అందంగా అలంకరిస్తాం. ఈసారి పండుగను సాధారణ ప్రమిదలతో కాకుండా... రంగురంగుల కాంతులను వెదజల్లే ప్రమిదలతో పండుగ చేసుకుందాం... ప్రమిదలను తెచ్చి, వాటిని అందంగా అలంకరిద్దాం... మన శరీర అలంకరణతో పోటీ పడేలా చేద్దాం.
ఇక్కడ మచ్చుకి కొన్ని దీపాల నమూనాలు ఇస్తున్నాం. వీటిని చూసి మీరు అలాగే చేయక్కర్లేదు. మీలోని సృజనకు పదును పెట్టండి. కొత్తకొత్త దీపాలతో దీపావళి పండుగను కళ్లు మిరుమిట్లు గొలిపేలా జరుపుకోండి. మీ దీపాలను చూసి చిచ్చుబుడ్లు ముఖం చిన్నబుచ్చుకోవాలి. తారాజువ్వలు తలదించి చూడాలి. కాకర పువ్వొత్తులు కారాలు మిరియాలు నూరాలి. ఇక ఆలస్యం దేనికి... పండగ వచ్చేస్తోంది!!