ప్రపంచస్థాయి యూనివర్శిటీలు లేదా సంస్థల నుంచి డిగ్రీ పొందాలని అనుకుంటున్నారా? అది కూడా ఇంట్లోంచి కాలు కదపకుండానే పూర్తి చేయాలనుకుంటున్నారా? అయితే కోర్సెరా మొబైల్ అప్లికేషన్ మీ కోసమే. గూగుల్ ప్లే స్టోర్‌లో ఉచితంగా లభ్యమయ్యే ఈ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే చాలు.. దాదాపు వంద యూనివర్శిటీలు, సంస్థలందించే 600 కోర్సు లను ఇంట్లో కూర్చునే పూర్తి చేయవచ్చు. దాదాపు 20 సబ్జెక్టులకు సంబంధించిన ఈ కోర్సులకు సంబంధించిన లెక్చర్లు అన్నీ వీడియోల రూపంలో అందుబాటులో ఉంటాయి మరి.
కోర్సులను ఎంపిక చేసుకుని నోటిఫికేషన్ రాగానే సైన్‌అప్ చేసుకుంటే సరి. నిపుణులైన ఇన్‌స్ట్రక్టర్ల నుంచి పాఠాలు, అవసర మైన సాయం కూడా అందుతూం టుంది. మీకు నచ్చిన కోర్సును ఎంచుకుని రిజిస్టర్ చేసుకో వడం... ఆ కోర్సు నోటిఫికేషన్ రాగానే సైన్‌అప్ చేసుకుంటే చాలు. ఇంగ్లీషుతోపాటు దాదాపు 12 భాషల్లో లభ్యమవుతాయి
మైక్రోసాఫ్ట్ ఆఫీస్...
స్మార్ట్‌ఫోన్ ద్వారా ఆఫీసు పనులు చక్కబెట్టాలనుకుంటున్నారా? వర్డ్‌ఫైళ్లు, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు చూసేందుకు ఇతర సాఫ్ట్‌వేర్లపై ఆధారపడాల్సిన అవసరం లేదిప్పుడు. ఎంచక్కా మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సాఫ్ట్‌వేర్‌నే మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లోకి డౌన్‌లోడ్ చేసుకుని వాడుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ దాదాపు నెల రోజుల క్రితం అప్‌డేట్ చేసిన ఈ అప్లికేషన్ పదిలక్షలకుపైగా డౌన్‌లోడ్‌లతో ఇప్పటికే సూపర్‌హిట్ అయింది కూడా. వర్డ్, ఎక్సెల్ ఫైల్స్ ఎడిటింగ్, పవర్‌పాయింట్ ఫైళ్లను ఎడిట్ చేసుకునే అవకాశం ఉండటం, పవర్ పాయింట్ స్లైడ్స్‌ను చూడగలగడం, ఈమెయిల్ అటాచ్‌మెంట్లను డౌన్‌లోడ్ చేసుకోవడంతో పాటు, ఎడిట్ చేసుకోగలగడం ఈ అప్లికేషన్ కున్న కొన్ని ప్రత్యేకతలు. మీరు సాయంత్రం వరకూ ఆఫీసులో చూసిన ఫైళ్లను క్లౌడ్ ద్వారా యాక్సెస్ చేసుకుని పనిచేసుకో వచ్చు కూడా. ఆండ్రాయిడ్ 4.0 కంటే ఆధునిక వర్షన్లతో పనిచేస్తుంది మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఆండ్రాయిడ్ అప్లికేషన్.
క్రోమ్ రిమోట్ డెస్క్‌టాప్...
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌తో పీసీకి అనుసంధానమయ్యేందుకు అవకాశం కల్పించే అప్లికేషన్ ఇది. రెండింటిలోనూ క్రోమ్ బ్రౌజర్‌ను ఉపయోగించడం ద్వారా పీసీ డెస్క్‌టాప్‌ను స్మార్ట్‌ఫోన్‌పై నుంచే నియంత్రించుకోవచ్చు. ముందుగా పీసీపై అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసు కుని రిమోట్ యాక్సెస్‌ను సెట్ చేసుకోవాలి. ఆ తరువాత స్మార్ట్‌ఫోన్‌పై అప్లికేషన్‌ను నొక్కడంతో రిమోట్ యాక్సెస్ ప్రారంభమవుతుంది.