
వారు సైతం...
మహిళలు ఉద్యమాలు చేస్తే ‘మాకేమి సంబంధం’ అన్నట్లు అంటీముట్టనట్లు ఉండే పురుషులు కొందరైతే, వారికి వెన్నుదన్నుగా ఉండే పురుషులు కొందరు.
మగానుభావులు
మహిళలు ఉద్యమాలు చేస్తే ‘మాకేమి సంబంధం’ అన్నట్లు అంటీముట్టనట్లు ఉండే పురుషులు కొందరైతే, వారికి వెన్నుదన్నుగా ఉండే పురుషులు కొందరు. పురుషులతో సమానంగా స్త్రీలకు హక్కులు ఉండాలని అమెరికన్ ఈక్వల్ రైట్స్ అసోసియేషన్(ఎయిఆర్‌ఎ)తో పాటు ‘స్త్రీలకు ఓటు హక్కు ఉండాలి’ అనే నినాదంతో చేసిన ఉద్యమాల్లోనూ చాలామంది పురుషులు చురుగ్గా పాల్గొన్నారు.
స్త్రీల హక్కుల కోసం పనిచేయడానికి ఒకానొక కాలంలో అమెరికాలో పురుష సంఘాలు కూడా ఏర్పడ్డాయి.1912లో ఏర్పడిన ‘ది నేషనల్ మెన్ లీగ్’లో ఇరవై వేల మంది సభ్యులు ఉండేవారు. అభ్యుదయవాదులైన ఈ పురుషులు స్త్రీలకు మద్దతుగా ఉపన్యాసాలు ఇచ్చారు. వ్యాసాలు రాశారు.చిత్తశుద్ధితో పనిచేశారు.
హెన్రీ బ్లాక్‌వెల్ తన భార్య లూసి స్టోనోతో పాటు మహిళలకు సంబంధించిన రకరకాల హక్కుల ఉద్యమాల్లో పాల్గొన్నాడు. భార్య చేస్తున్న ఉద్యమాల్లో పాల్గొన్న హెన్రీ బ్లాక్‌వెల్ లాంటి పురుషులు ఎందరో చరిత్రలో ఉన్నారు.