
గుంటూరు జిల్లా కొర్నెపాడులో రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 17(ఆదివారం)న ఉ. 10 గం. నుంచి సా. 4 గం. వరకు ‘సేంద్రియ సాగులో చీడపీడల నివారణకు లింగాకర్షక బుట్టలు, జిగురు అట్టల వాడకం–ఉపయోగాల’పై ఉద్యాన శాఖ ఏడీ రాజా కృష్ణారెడ్డి, ఖాజా రహమతుల్లా శిక్షణ ఇస్తారు. వివరాలకు.. 97053 83666
జలసంరక్షణ, బోరు రీచార్జ్ పద్ధతులపై శిక్షణ
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బోర్లను రీచార్జ్ చేసుకునే పద్ధతి సహా వివిధ జల సంరక్షణ పద్ధతులపై డిసెంబర్ 16న స్వచ్ఛంద కార్యకర్తలు, విద్యార్థులు, రైతు బృందాలు, వ్యక్తులకు సికింద్రాబాద్ తార్నాకకు చెందిన వాటర్ అండ్ లైవ్‌లీహుడ్స్ ఫౌండేషన్ హైదరాబాద్ రెడ్‌హిల్స్‌లోని సురన ఆడిటోరియంలో శిక్షణ ఇవ్వనుంది.
భూగర్భ జల సంరక్షణలో అపారమైన అనుభవం కలిగిన జలవనరుల ఇంజినీరు ఆర్. వి. రామమోహన్ శిక్షణ ఇస్తారు. జలసంరక్షణలో అనుభవాలను పంచుకునే ఆసక్తి గల వారు కూడా సంప్రదింవచ్చు. ఆంధ్రప్రదేశ్ వాసులు ఎక్కువ మంది ఆసక్తి చూపితే విజయవాడలోనూ శిక్షణ ఇవ్వనున్నట్లు రామ్‌మోహన్ తెలిపారు. రిజిస్ట్రేషన్, ఇతర వివరాలకు..
040–27014467, e-mail: wlfoundation@outlook.com.
16న చిరుధాన్య వంటకాల తయారీపై శిక్షణ
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని భారతీయ చిరుధాన్య పరిశోధనా స్థానం(కేంద్ర ప్రభుత్వ సంస్థ)లోని న్యూట్రిహబ్‌లో ఈ నెల 16న ‘కుకింగ్ విత్ మిల్లెట్స్’ శిక్షణ ఇవ్వనున్నారు. చిరుధాన్యాల ఆహారోత్పత్తుల ప్రయోజనాలను తెలియజెప్పడంతో పాటు చిరుధాన్యాలతో వివిధ రకాల వంటకాలు, చిరుతిండ్లను తయారు చేయడంపై గృహిణులు, స్వయం సహాయక బృందాల సభ్యులు, పాకశాస్త్రనిపుణులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఫీజు రూ. 1,500. రిజిస్ట్రేషన్లు, ఇతర వివరాలకు.. 94904 76098.
Comments
Please login to add a commentAdd a comment