విటమిన్-డితో రక్తపోటుకు చెక్ | With vitamin D blood pressure check | Sakshi
Sakshi News home page

విటమిన్-డితో రక్తపోటుకు చెక్

Published Mon, Dec 28 2015 11:01 PM | Last Updated on Wed, Apr 3 2019 4:37 PM

విటమిన్-డితో  రక్తపోటుకు చెక్ - Sakshi

విటమిన్-డితో రక్తపోటుకు చెక్

పరిపరి... శోధన
 
సూర్యరశ్మి నుంచి సహజసిద్ధంగా లభించే విటమిన్-డి ఎముకల పటిష్టతకు దోహదపడుతుందని తెలిసిందే. దీనితో మరో ప్రయోజనమూ ఉందని ఇటీవలి పరిశోధనల్లో వెల్లడైంది. విటమిన్-డి పుష్కలం గా తీసుకుంటే, అధిక రక్తపోటు బారినపడే ముప్పు చాలా వరకు తప్పుతుందని బ్రిటన్‌కు చెందిన క్వీన్ మార్గరెట్ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు.

విటమిన్-డి శరీరానికి సమృద్ధిగా లభిస్తే, మానసిక ఒత్తిడిని కలిగించే ‘కార్టిసోల్’ హార్మోన్ విడుదల తగ్గుతుందని, ఫలితంగా రక్తపోటు కూడా అదుపులోకి వస్తుందని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన క్వీన్ మార్గరెట్ వర్సిటీ శాస్త్రవేత్త డాక్టర్ రాక్వెల్ రెవ్యూల్టా ఇనీస్టా చెబుతున్నారు. విటమిన్-డి తగినంతగా తీసుకునే వారికి డయాబెటిస్, ఆర్థరైటిస్, కొన్ని రకాల కేన్సర్లు వచ్చే అవకాశాలు కూడా చాలా వరకు తగ్గుతాయని ఆయన వివరిస్తున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement