టైప్-1 డయాబెటిస్ అంటే ఏమిటి? మా పిల్లవాడికి టైప్-1 డయాబెటిస్ అన్నారు. దీని గురించి వివరించి, మావాడు పాటించాల్సిన ఆహార నియమాలు వివరించండి.
- కృష్ణమూర్తి, నల్గొండ
పిల్లల్లో సాధారణంగా 15 ఏళ్ల లోపు వారిలో వచ్చే చక్కెరవ్యాధిని టైప్-1 డయాబెటిస్ (మధుమేహం) అంటారు. టైప్-1 డయాబెటిస్ అంటే ఇందులో క్లోమగ్రంథి అస్సలు పనిచేయదు. అంటే క్లోమగ్రంథి తయారు చేయాల్సిన ఇన్సులిన్ శరీరంలో అస్సలు ఉండదన్నమాట. కాబట్టి వీరికి ఇన్సులిన్ మాత్రలతో ఆరంభించి, కొంతకాలానికి ఇంజెక్షన్‌కు మారుస్తుంటారు.
సి-పెప్టైడ్ అనే ప్రోటీన్ మోతాదు 0.3 నానోగ్రాము ఉంటే క్లోమగ్రంథి సక్రమంగా పనిచేస్తున్నట్టు లెక్క. అంతకన్నా తక్కువ ఉంటే క్లోమగ్రంథి పనిచేయక, టైప్-1 డయాబెటిస్ ఉన్నట్టు నిర్ధారణ చేయవచ్చు. కొందరిలో ఈ కొలత సాధారణంగా ఉంటూ కూడా మధుమేహం వస్తుంది. అంటే ఇన్సులిన్ బాగానే ఉంది కానీ మధుమేహం వచ్చింది కాబట్టి ఇది టైప్-2 డయాబెటిస్ అని చెప్పవచ్చు. కాబట్టి పిల్లల్లో మధుమేహం ఉంటే నేరుగా ఇన్సులిన్ ఇవ్వకుండా సి-పెప్టైడ్ ఏ స్థాయిలో ఉందో చూసుకొని వైద్యం చేయాల్సి ఉంటుంది.
చిన్నపిల్లల్లో మధుమేహం ఉంటే పాటించాల్సిన ఆహార నియమాలు:
పిల్లల్లో ఎలాంటి ఆహార నియమాలు వద్దు 15-25 మధ్య వయసువారు లావుగా ఉంటేనే బరువు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే జంక్‌ఫుడ్ తగ్గించుకోవాలి. ఇన్సులిన్ నిరోధకత రక్తంలో ట్రైగ్లిజరైడ్స్‌ను పెంచుతుంది కాబట్టి ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉంటే ఆహారంలో పిండిపదార్థాలు తగ్గించుకోవాలి 5 - 15 ఏళ్ల వయసువారికి ఎలాంటి ఆహారనియమాలు పెట్టకూడదు. వారి ఎదుగుదల కోసం వాళ్ల బరువుకు తగినట్లు ఎన్ని క్యాలరీలు అవసరమవుతాయో డైటీషియన్‌ను సంప్రదించి వారు చెప్పినట్లు పాటించాలి. త్వరగా జీర్ణమయ్యే పిండి పదార్థాలను వాడాలి. మార్కెట్‌లో దొరికే పిజ్జా, బర్గర్, ఐస్‌క్రీమ్స్, నూడుల్స్, బిస్కెట్లు వాడకూడదు పిల్లల ఎదుగుదలకు ఆహారం ఎంతో ముఖ్యం. కాబట్టి తల్లిదండ్రులు ఆహారం విషయంలో ఆంక్షలు విధించడం, ఆహారాన్ని తగ్గించి, వ్యాయామాలను పెంచడం చేస్తే అసలే పిల్లల్లో తక్కువగా ఉండే రోగనిరోధకశక్తి మరింత తగ్గుతుంది. దీనికితోడు క్షయవ్యాధి వచ్చే ప్రమాదం ఉంది.
ఎలాంటి లక్షణాలతో టైప్-1ను గుర్తించవచ్చు...
టైప్-1 డయాబెటిస్ హఠాత్తుగా వస్తుంది. రక్తంలో గ్లూకోజు ఆర్నెల్ల నుంచి పన్నెండు నెలల్లోపు 100 - 500 పెరగవచ్చు అతిమూత్రం, ఆకలి, దాహం వేయడం, మూత్రవిసర్జనకు ఎక్కువసార్లు వెళ్తుంటారు. రోగనిరోధకశక్తి తగ్గడంతో తరచూ ఇన్ఫెక్షన్ల బారిన పడుతుంటారు ఎదుగుదల తగ్గుతుంది.
హోమియోవైద్యవిధానంలో చికిత్స: హోమియోలో టైప్-1కు అద్భుతమైన వైద్యం అందుబాటులో ఉంది. ఇన్సులిన్‌తోపాటు హోమియో మందులు ఇవ్వడం వల్ల పిల్లల్లో రోగనిరోధకశక్తి పెరుగుతుంది.ఎదుగుదల లోపం, సోమరితనం, అతిమూత్రం లాంటి లక్షణాలను పూర్తిగా నయం చేయవచ్చు. ఇది పూర్తిగా సురక్షితం, దుష్పరిణామాలు ఉండవు.
డాక్టర్ టి. కిరణ్ కుమార్
పాజిటివ్ హోమియోపతి
హైదరాబాద్
టైప్-1 డయాబెటిస్‌కు చికిత్స ఎలా?
Published Tue, Jul 7 2015 10:56 PM | Last Updated on Thu, Oct 4 2018 5:10 PM
Advertisement
Advertisement