
యాప్.. యాప్.. హుర్రే..!
మొబైల్ యాప్స్‌కు తాను పెద్ద ఫ్యాన్‌నని, ఈ యాప్స్ మన జీవితాన్ని మరింత సౌకర్యవంతంగా, వినోదభరితంగా మారుస్తాయని హీరో అల్లు అర్జున్ కితాబునిస్తారు. సోమాజిగూడ పార్క్ హోటల్‌లో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఓఎల్‌ఎక్స్ డాట్ ఇన్ టీవీ కమర్షియల్ యాడ్‌ను ఆయన ఆవిష్కరించారు. పాత వస్తువుల కొనుగోలు, విక్రయాలకు ఈ యాప్ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ఓఎల్‌ఎక్స్ కమర్షియల్ యాడ్‌లో అల్లు అర్జున్, రెజీనా కాసాండ్రలు నటించారు.