‘క్లాసికల్’ పీటముడికి సత్వర స్పందనే పరిష్కారం | Classical status to Telugu language | Sakshi
Sakshi News home page

‘క్లాసికల్’ పీటముడికి సత్వర స్పందనే పరిష్కారం

Published Tue, Apr 7 2015 2:11 AM | Last Updated on Sat, Sep 2 2017 11:56 PM

రామతీర్థ

రామతీర్థ

సందర్భం

 ఏ దశలోనైనా గుర్తింపుపొందిన సాహిత్యం ఆ భాషలో వచ్చి ఉంటే దాన్ని విశిష్ట భాషగా గుర్తించవచ్చనేది యునెస్కో వంటి సంస్థల అవగాహన. దీనికీ, శాసనాలు వెతుక్కుని ప్రాచీనతలు నిర్ధారించుకునే చాదస్తానికి ఎలాంటి సంబంధం లేదు.
 
 తెలుగు, కన్నడ, మలయాళ, ఒడియా భాషలకు క్లాసికల్ హోదా వర్తింపునకు సంబం ధించి మద్రాస్ హైకోర్టు పంపిన నోటీసులకు జవాబు గా ఆంధ్రా, తెలంగాణ, కర్ణాట క, కేరళ, ఒడిశా ప్రభుత్వాలు తమ వాదనలను ఈ బుధవా రం (ఏప్రిల్ 8) సమర్పించా ల్సి ఉంది. ఆ ప్రభుత్వాలు తమ తమ భాషలకు విశిష్ట హోదా రావడం, ఏ విధం గానూ తమిళ భాషాభివృద్ధికి విఘాతం కాదని హైకోర్టు కు విన్నవించాలి. అంతేకాకుండా ఫెడరల్ స్ఫూర్తికి భిన్నంగా తమిళుడైన ఆర్ గాంధీ, ఈ నాలుగు భాషల అభివృద్ధికి ఉపయోగపడేలా కేంద్ర ప్రభుత్వం ప్రకటిం చిన క్లాసికల్ (విశిష్ట) హోదాకు అకారణంగా అడ్డుపడు తున్నారనే  విషయాన్ని కోర్టు ముందుకు తీసుకెళ్లాలి. ఈ నాలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ అంశంపై సమాధానం ఇచ్చేటప్పడు, తమ భాషల పరిరక్షణా, పరిశోధనా రంగాల అభివృద్ధి ఏ విధంగానూ తమిళ ప్రజల ప్రయో జనాలకు నష్టం కలిగించదని కోర్టుకు స్పష్టం చేయాలి.

 అసలుకు క్లాసికల్ హోదా అంటే ఏమిటో ఈ రాష్ట్రా లలో ఏ మేరకు అవగాహన ఉందో చూద్దాం. ఈ ఆంగ్ల పదాన్ని ఒక్కో రాష్ట్రం వారు ఒక్కోలా తమ భాషలో వ్యవహరిస్తున్నారు. ‘శాస్త్రీయ తమిళ్’ అంటూ హిందీలో ఉపయోగిస్తూనే, ‘సెందమిళ్’ అంటూ తమ తమిళ భాషా భివృద్ధి సంస్థను మైసూరు నుంచి వేరు చేసి తమ రాష్ట్రం పట్టుకుపోయి ఎంచక్కా కేంద్రప్రభుత్వ నిధులతో ఒరిగే సమస్త లబ్ధినీ 2008 నుంచీ పొందుతున్నారు. ఇక కన్నడలో దీన్ని ‘అభిజాతె కన్నడ’ అంటున్నారు. మనం తెలుగులో ప్రాచీన భాష అంటున్నాము. మలయాళంలో ‘శ్రేష్టభాష’ అంటున్నారు. ఒడియాలో ‘శాస్త్రీయ మాన్య త’ అంటున్నారు. వీటిలో ఏ పేరూ క్లాసికల్ అంటే సాహి త్య విశిష్టత అనే అర్థంలో లేదు. దాదాపు అన్ని భాషల వారూ ఈ హోదా విషయమై క్లాసికల్ అనే పదానికి సం స్కృతపదాన్నే తమ భాషలో వాడుతున్నారు.

 వాస్తవానికి ఏ దశలోనైనా విశిష్టంగా గుర్తింపు పొం దిన సాహిత్యం ఆ భాషలో వచ్చి ఉంటే ఆ భాషను విశిష్ట భాషగా గుర్తించవచ్చనేది అంతర్జాతీయ విద్యావంత సమాజంలో, యునెస్కో వంటి ప్రతిష్టాత్మక సంస్థలకు గల అవగాహన, దీనికీ శాసనాలు వెతుక్కుని ప్రాచీన తలు నిర్ధారించుకునే చాదస్తానికి ఎలాంటి సంబంధం లేదు. మనం ప్రాచీనం అనుకున్నాం కాబట్టి, అలా తమి ళులు తప్పుదారి పట్టించారు కాబట్టి, అందరం ఈ ప్రాచీనతే విశిష్టత అని నమ్ముతూ నిష్ఫలంగా వెతు క్కుంటూ పోతున్నాం. అదే తమిళులకు కూడా కావల సింది కాబట్టి, గుట్టు చప్పుడు కాకుండా వారి భాష సంస్థ అభివృద్ధి అవుతుండగా, మిగతా దక్షిణాది భాషల అభివృద్ధిని వారు కేసుల ద్వారా తొక్కి పట్టి ఉంచుతు న్నారు. మనం మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లు మిగిలిపోయాం.

 ఇప్పటికైనా ఈ కేసునుంచి త్వరగా బయటపడి తెలుగు క్లాసికల్ సంస్థను రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఏర్పాటు చేసుకోవాలి. దీనికి ముందుగా ఆర్ గాంధీ అనే తమిళుడు మనకు వ్యతిరేకంగా వేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని విచారించే కోర్టుకు చెప్పాల్సిన అంశాలపై తెలుగు రాష్ట్రాలకు స్పష్టత ఉండాలి. తనను తాను ఈ కేసులో ఇంప్లీడ్ చేసుకుని భాషాభిమానిగా చెన్నై నివాసి తొమాటి సంజీవరావు వ్యక్తిగా ఒంటి చేత్తో పోరాడుతూ చూపుతున్న అంకితభావం మన ప్రభుత్వాలకూ, పౌర సమాజానికీ ఆదర్శం కావాలి.

 గుర్తించాల్సిన అంశాలు: 1. క్లాసికల్ అంటే కాల సూచి కాదు. ఆయా భాషా సాహిత్యాలలో ఒక విశిష్ట రచన వచ్చిందా అన్న దానికి సంబంధించిన గుర్తింపు మాత్రమే. 2. ఎంత వేల ఏళ్ల కిందటి ‘సంగం’ సాహి త్యం గురించి తమిళులు మాట్లాడినా వారు 2008లో ఈ క్లాసికల్ హోదా పొందినప్పుడు, కాల నియమం ఒక వెయ్యి ఏళ్లు మాత్రమే ఉన్నది. దీనిని వారు పొందాల్సిన లబ్ధి పొందాక, 2009లో సంస్కృతానికి కూడా ఈ క్లాసి కల్ హోదా ఇస్తూ అప్పటి కేంద్ర ప్రభుత్వం 1500- 2000 ఏళ్లుగా సవరించింది. 3. దీనిపై అంతర్జాతీయం గా ఏ మార్గదర్శక నిబంధనావళి లేదు. నాలుగు వందల ఏళ్లు చరిత్ర లేని భాషలను కూడా అంతర్జాతీయ సమా జం క్లాసికల్ భాషలుగా గుర్తించింది. 4. పెపైచ్చు వేల ఏళ్ల కిందటే తమ భాషలో రచనలు ఉన్నాయని చెబు తున్న తమిళులు ఎరగవలసింది ఏమిటంటే, ఆ రచనలు జరిగింది మూల ద్రవిడంలో, అంటే, మొత్తం దక్షిణాది భాషలకు కుదురు అయిన భాష అది. 5. అయిదు వం దల ఏళ్లు మించిన రచనా వారసత్వం లేని మలయాళం, ఒడియా భాషలు క్లాసికల్ హోదాకు అర్హం అని కేంద్ర ప్రభుత్వం భావించినప్పుడే కాల నియమ నిబంధనతో క్లాసికల్ హోదాకు సంబంధం లేదన్న అవగాహన గల అంతర్జాతీయ సమాజపు ఆలోచనకు దగ్గరగా వచ్చినట్టే. అందువల్ల, తెలుగు, కన్నడ, భాషా సమాజాలు ఇప్పు డిక తాము అంత ప్రాచీనులం అంటే ఇంత ప్రాచీనులం అని శాసనాలు చూపెట్టే ఈ తెలివి తక్కువ పనులు మానుకుని, తగు వాదనలతో, తమ జవాబులను కోర్టు కు సమర్పించాల్సి ఉన్నది. 6. అటు కేంద్ర ప్రభుత్వ మూ, ఇటు ఈ నాలుగూ రాష్ట్ర ప్రభుత్వాలు కోర్టులో సమర్పించే విషయపు ఏకాభిప్రాయంపైనే, ఈ కేసు త్వరగా తేలే విషయం ఆధారపడి ఉన్నది. అందుకు అనుగుణంగా ఈ రాష్ట్రాల సాంస్కృతిక శాఖలు తక్షణ చర్యలు, ఏడేళ్ల కాలం గడిచిపోయిన ఈ తరుణంలోనైనా మొదలు పెట్టగలిగితే, మంచి జరుగుతుంది. 7. పౌర సమాజం, అందుకు తగు ఒత్తిడిని, సాంఘికంగా, సాం స్కృతికంగా, ఆచరణ చేయవలసిన రాజకీయ వర్గాలపై తీసుకురావడం, ప్రభుత్వ వర్గాలను సచేతనం చేయడం మనం అందరం చేయవలసిన పని.

 (వ్యాసకర్త ప్రముఖ కవి, రచయిత)
 మొబైల్: 98492 00385

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement