కాక్ టేల్.కామ్
లక్కుండిన చుక్కొచ్చును,చుక్కడితే గొంతులోన చురచురమంటూ గుక్కలుగా కిక్కెక్కును కిక్కెచ్చిన వైనుతేయ! కిరికిరి మొదలౌ!
‘బుడ్డి’మంతులు ఎంత తాపత్రయపడ్డా... కూసింత లక్కుంటే గానీ గొంతు తడుపుకోవడానికి గుక్కెడు చుక్క దొరకదు. లక్కు కలిసొచ్చి, అనాయాసంగా చుక్కేం ఖర్మ, ఏకంగా నిండైన ‘సీసా’పద్యమే చేతికి అందివస్తే! అలాంటి అరుదైన సందర్భాన్నే ‘మందు’భాగ్యమంటారు ‘మందు’ మతులు. ‘మందు’భాగ్యం కలిగినప్పుడు మనసు మదిరానంద డోలికలలో తేలియాడటం కద్దు! అట్టి మదిరానంద తరుణాన ‘బుడ్డి’మంతులందరూ కలసి తగిన ‘మందో’బస్తుతో పీనాబజానా ఏర్పాటు చేయడం ‘సారా’మామూలే! మొదటి పెగ్గు మధువులోని మంచుముక్కలు కరిగేలోగానే గొంతులోకి జారిపోతుంది.
మనసు తేలికవుతుంది. రెండో పెగ్గు కొనసాగుతున్న స్థితిలో ‘సారా’స్వత సమావేశంలో సర్వసమానత్వ స్థితి మొదలై, వాతావరణం ప్రజాస్వామికమవుతుంది. మూడోది ముగిసి, ఆపై ముందుకెళితేనే తంటా! కొందరికి కిక్కు హెచ్చి కిరికిరి మొదలవుతుంది. ప్రజాస్వామ్యం ముదిరి అరాచకవాదంగా పరిణమిస్తుంది. అట్టి దుష్పరిణామాలను నియంత్రించగల ‘మందు’జాగ్రత్తపరుల కోసం ఈ వారం..
‘మధు’రోక్తి
మధువు మనుషులందరినీ సమానం చేసేస్తుంది. అది సిసలైన ప్రజాస్వామికవాది.
- టెర్రీ ప్రాట్‌షెట్, బ్రిటిష్ రచయిత
డార్‌క డిలైట్
వోడ్కా : 30 మి.లీ.
డార్క్ రమ్ : 30 మి.లీ.
కోకాకోలా : 60 మి.లీ.
సోడా : 90 మి.లీ.
గార్నిష్ : ఐస్‌క్యూబ్స్, ఆరెంజ్ ట్విస్ట్
వైన్‌తేయుడు