ఊబకాయానికి విరుగుడు క్రయోలిపోలైసిస్ | cryolipolysis a Antidote for obesity | Sakshi
Sakshi News home page

ఊబకాయానికి విరుగుడు క్రయోలిపోలైసిస్

Published Sun, Nov 2 2014 3:35 AM | Last Updated on Sat, Sep 2 2017 3:43 PM

ఊబకాయానికి విరుగుడు క్రయోలిపోలైసిస్

ఊబకాయానికి విరుగుడు క్రయోలిపోలైసిస్

‘కేవలం ఒకే ఒక్కసారి మీరు క్లినిక్‌ను సందర్శించండి. మీ శరీరంలోని అధిక కొవ్వును పూర్తిగా తొలగించుకోండి’ ఊబకాయం వ్యాధుల పుట్ట అని తెలుసుగానీ... దాన్నే ఒక వ్యాధిగా అంగీకరించాల్సిన తరుణం వచ్చిందా? అవునంటూ ‘అమెరికా వైద్యుల సంఘం’ ఒక తీర్మానం ఆమోదించింది.
 
ఒకవేళ వ్యాధిగా పరిగణిస్తే చికిత్స తప్పదు. మందులు, ఆపరేషన్లతో సమస్య పరిష్కారం కాదు. ఇవేమీ లేకుండా క్రయోలిపోలైసిస్, నాన్ సర్జికల్ లైపోసక్షన్ పద్ధతుల ద్వారా ఊబకాయాన్ని తగ్గించవచ్చు. ఊబకాయమంటే కేవలం ఒంట్లో కొవ్వు పేరుకోవటం, కాస్త లావుగా, బొద్దుగా ఉండటం ఒక్కటేకాదు. అవసరమైనపుడు శరీరానికి శక్తినిచ్చే ఈ కొవ్వు కణాలు... ఒంట్లో రకరకాల హానికర రసాయనాలను విడుదల చేయటం, బీపీ పెంచటం, రక్తనాళాలు గట్టిపడేలా చేయటం వంటి దుష్ర్పభావాలు చూపుతాయి.
 
పరిష్కార మార్గం..!  
ఊబకాయం, దీనికి కారణమైన ‘అధికబరువు’ తగ్గించుకోవాలనుకొనేవారికి హైదరాబాద్ ‘హైల్తీ కర్వ్స్ స్లిమ్మింగ్ అండ్ కాస్మటిక్ క్లినిక్’ అత్యాధునాతనమైన అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన విధానాలయిన ‘క్రయోలిపోలైసిస్’, ‘నాన్ సర్జికల్ లిపోలైసిస్’లను ఉపయోగించి సమస్యలను పరిష్కరిస్తారు. ఒకటి రెండు సిట్టింగుల్లో లైపోసక్షన్‌కి ప్రత్యామ్నాయంగా, సర్జరీ లేకుండా కొవ్వును తొలగించే చికిత్స. అమెరికా, లండన్ వంటి దేశాల్లో  ఇది బాగా ప్రాచుర్యంలో ఉంది. దీనికి అమెరికా ఊఈఅ అనుమతికూడా లభించింది.
 
క్రయోలిపోలైసిస్ చేసే విధానం
మొదటగా డాక్టర్ శరీరంలో కొవ్వు పేరుకు పోయిన భాగాలను గుర్తిస్తారు. ఆ భాగాలను కొన్ని ప్రత్యేకమైన చికిత్సతో చల్లబరచటం ద్వారా అక్కడ ఉన్న కొవ్వు కణాలు కొంత సమయం తరువాత స్తంభించిపోయి, నెమ్మదిగా వాటంతట అవి చనిపోతాయి. ఈ పద్ధతిని వైద్యపరిజ్ఞానంలో అపోప్టసిస్ (అ్క్కైఖీైఐ) అంటారు. ఈ విధానం ద్వారా చికిత్స చేశాక కొవ్వు పేరుకుపోయిన భాగాల్లో కణాలు  పూర్తిగా చనిపోయి, నెమ్మదిగా శరీరం నుంచి బయటకు వెళ్లిపోతాయి.

అందువల్ల మళ్లీ కొవ్వు పేరుకుపోయే ప్రసక్తే ఉండదు. చికిత్స తరువాత ఎలాంటి ఇబ్బందులూ లేకుండా మన పనులు మనం చేసుకోవచ్చు. ఎలాంటి మందులూ వాడాల్సిన అవసరం లేదు. చికిత్స జరిగిన మూడు వారాల నుంచి మూడు నెలల వ్యవధిలోనే ఫలితాలను గమనిస్తారు. చికిత్స ఖర్చు... ఏ భాగాలలో ఎంత మేర కొవ్వు తొలగించాలనే దానిపై ఆధారపడి ఉంటుంది.   
 
చాలామంది ఒక్కసారి ట్రీట్‌మెంట్ తీసుకుంటే సరిపోతుంది అనుకుంటారు. కానీ.. ‘బాడీ మాస్ ఇండక్స్’ (ఆకఐ) ‘35’ కంటే ఎక్కువగా ఉన్నవారికి క్రయోలిపోలైసిస్‌తో పాటు ప్రతి 10 నుంచి 15 రోజులకోసారి ‘నాన్ సర్జికల్ లైపోసక్షన్’ చేయించుకోవటం వలన ఎక్కువగా అదే విధంగా, త్వరితముగా ఫలితమును చూడవచ్చు. ‘నాన్ సర్జికల్ లిపోసక్షన్’ చికిత్సా విధానంలో అల్ట్రాసౌండ్ తరంగాలను ఉపయోగించి ఎలాంటి దుష్ర్పభావాలు లేకుండా కొవ్వును కరిగిస్తారు. కరిగిన కొవ్వు అంతా వివిధ విసర్జక పద్ధతుల ద్వారా బయటకు పోతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement